150 వ్యాధులకు ఒకటే దివ్యౌషధం!
ఈ ప్రకృతిలో మనకు అందుబాటులో ఎన్నోరకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. ఆయుర్వేదం చెప్పే విషయం కూడా ఇదే. పెరటిచెట్టు వైద్యానికి పనికిరాదన్నట్లుగా మనం వాటిని పట్టించుకోం. ఇంగ్లిషు మందులవెంట పరిగెడతాం. అవి తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తాయేకానీ శాశ్వత ఉపశమనాన్ని ఇవ్వలేవు. ఇంట్లో అలంకరణ కోసం పెంచే మొక్కల్లో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. ఈ కోవకే చెందిన రణపాల మొక్క వల్ల అనేక ఉపయోగాలున్నాయి. అలంకారానికే కాదు.. ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మంచిదని ఆయుర్వేద వైద్యులు తెలియజేస్తున్నారు.
ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు కాదు.. 100 కాదు.. 150 వ్యాధులను ఈ మొక్క నయం చేస్తుంది. ఏయే వ్యాధులను ఇది నయం చేస్తుందో తెలుసుకుందాం. రణపాల ఆకు చాలా దళసరిగా ఉంటుంది. రుచిలో వగరుగా, పులుపుగా ఉంటుంది. ఆకుల నుంచే వేర్లు వస్తాయి. ఆకులను నాటడంద్వారా మొక్కలను పెంచవచ్చు. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబయోల్, యాంటీ వైరల్, యాంటీ హిస్టామైన్ తోపాటు అనాఫీలాక్టిక్ గుణాలు ఎక్కువగా ఉంటాయి.

రణపాల ఆకును తినడంద్వారా లేదంటే కషాయం తయారు చేసుకోవడంద్వారా లేదంటే ఆకు రుబ్బి కట్టు కట్టడంద్వారా ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఆకులు తినడంవల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అంతేకాదు మధుమేహాన్ని క్రమబద్ధీకరిస్తుంది. తద్వారా కిడ్నీ సమస్యలు తగ్గుతాయి. ఆకులను వేడిచేసి గాయాలపైన పెట్టడంవల్ల త్వరగా మానతాయి. ఈ ఆకులను నూరి పొట్టుగా తలపైన పెట్టుకోవాలి. తలనొప్పి తగ్గతుంది. ఈ ఆకుల పసరును రెండు చుక్కలు చెవిలో వేసుకుంటే చెవి నొప్పి తగ్గడంతోపాటు చక్కగా పనిచేస్తాయి. వీటిని తినడంవల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.












Click it and Unblock the Notifications