కోడి గుడ్లను ఎంతసేపు ఉడికించాలి..?

గుడ్డు సంపూర్ణ పోషకాహారంగా వైద్యులు చెబుతారు. గుడ్డులో ప్రొటీన్‌, అత్యవసరమైన 9 అమైనో ఆమ్లాలు, బి కాంప్లెక్స్‌ విటమిన్లు, డి విటమిన్‌ తో పాటుగా ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్లనే వైద్యులు కూడా రోజుకో గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. ఈ కారణంతోనే చాలా మంది బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ లో ఉడికించిన గుడ్డును మరికొందరు ఆమ్లెట్ రూపంలో తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. మరి గుడ్లను ఎంతసేపు ఉడికించాలి..? మీకు తెలుసా..?

శరీరానికి అవసరమయ్యే ప్రొటీన్లు గుడ్డులో చాలా ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అందుకే గుడ్డును సంపూర్ణ పోషకాహారమని నిపుణులు అంటారు. కనీసం రోజుకు ఒక్క కోడి గుడ్డు అయినా తినాలని సూచిస్తుంటారు. డైలీ ఉడకబెట్టిన గుడ్డును తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే గుడ్లను ఎంతసేపు ఉడికించాలని చాలామందికి సందేహం ఉంటుంది. అయితే గుడ్డును 4 నుంచి 6 నిమిషాలు ఉడికిస్తే పై పొర లైట్ గా గట్టిపడుతుంది. లోపలి పచ్చసొన మాత్రం జిగురులా ఉంటుంది. జపాన్ లో ఇలా తింటారు.

Perfect Boiled Eggs How Long to Cook Chicken Eggs for Every Texture

ఇక గుడ్డును 7 నుంచి 9 నిమిషాల పాటు ఉడికిస్తే మీడియమ్ బాయిలింగ్ అంటారు. తెల్లసొన ఉడుకుతుంది. పచ్చసొన కొద్దిగా ఉడికి క్రీమీగా మారుతుంది. దీంట్లో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. సలాడ్స్ లో అధికంగా వాడతారు. ఇక గుడ్డును 10-12 నిమిషాలు ఉడికిస్తే దాన్ని హార్డ్ బాయిలింగ్ అంటారు. దీంట్లో తెల్లసొన, పచ్చసొన పూర్తిగా ఉడుకుతాయి. అలాగే 12 నిమిషాల కంటే అధికంగా ఉడికిస్తే ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. పచ్చ సొనలో ఐరన్, సల్ఫర్ రియాక్షన్ మొదలై.. కడుపుబ్బరం, అజీర్తి సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+