పురుషులకు ఎంతో మేలు చేసే పొన్నగంటి కూర
ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ప్రతిరోజు వీటిని తీసుకోవడంవల్ల అనేక అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. అందుకే వైద్యులు ప్రతిరోజు ఒక ఆకు కూర కచ్చితంగా తీసుకోవాలని సలహా ఇస్తుంటారు. అలాగే పొన్నగంటి కూరలో శరీరానికి అవసరమైన అనేక పోషకాలుంటాయి. ప్రధానంగా పురుషులకు ఎంతో మేలుచేస్తుందని, పలు రకాల సమస్యలను తగ్గిస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
బరువును నియంత్రిస్తుంది : పొన్నగంటి ఆకులో బి6, సి, ఏ విటమిన్లతోపాటు రైబోఫ్లవిన్, ఫొలేట్, మెగ్నీషియం, ఇనుము, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ పెరుగుతుంది. గుండెకు, మెదడుకు అత్యంత ఉత్సహాన్ని ఇస్తుంది. బ్రాంకైటిస్, ఆస్తమాతో బాధపడేవారు పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే అవి తగ్గుతాయి. ఎముకల ఎదుగుదలకు ఇందులో లభించే కాల్షియం ఎంతో దోహదపడుతుంది. అలాగే ఆస్టియోపోరోసిస్ వంటివాటిని కూడా పొన్నగంటి కూర దూరం చేస్తుంది. అంతేకాదు సుమా.. బరువును నియంత్రించడంతోపాటు క్యాన్సర్ కారకాలను కూడా నయం చేస్తుంది.

లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది : పొన్నగంటి కూరను తింటే పురుషులకు కావల్సిన శక్తి సమకూరుతుంది. ఈ కూర వారిలో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. జీవక్రియలోని లోపాలను కూడా సరిచేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ తాజా రసంలో వెల్లుల్లి కలిపి తీసుకుంటే దీర్ఘకాలింగా వేధించే దగ్గు, ఆస్తమా తగ్గుతాయి. నరాల్లో నొప్పికి, వెన్ను నొప్పి కూడా ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.
సన్నగా ఉండేవారికి వరం : కందిపప్పు, నెయ్యితో పొన్నగంటి కూరను తీసుకుంటే సన్నగా ఉండేవారు బరువు పెరుగుతారు. అలాగే ఆకును ఉడికించి మిరియాల పొడి, ఉప్పు కలిపి తీసుకుంటే బరువు తగ్గుతారు. కంటి కలకలు, కురుపులతో బాధపడేవారు కూడా పొన్నగంటి కూర తాజా ఆకులను కళ్లమీద కొంచెం సమయం ఉంచుకుంటే నొప్పి తగ్గుతుంది. వెన్ను నొప్పికి ఇది చక్కగా పనిచేస్తుంది. నరాల్లో వచ్చే నొప్పిని కూడా తగ్గిస్తుంది.












Click it and Unblock the Notifications