జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే ఇలా చేయండి!
జుట్టు ఊడిపోతోందంటే ఎవరికైనా ఎంతో బాధగా ఉంటుంది. వేల రూపాయలు, లక్షల రూపాయలు నష్టపోయినా అంత బాధపడరుకానీ ఒక్క వెంట్రుక ఊడిపోయినా రాజ్యాలు పోయినంత బాధ కలుగుతుంది. పురుషులకైనా, స్త్రీలకైనా ఈ తరహా ఆలోచనలే ఉంటాయి. ఎవరికివారు జుట్టు ఊడిపోకుండా ఉండేందుకు, ఒత్తుగా పెరిగేందుకు అనేకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
ఆరోగ్యకరమైన జీవనశైలి
ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా విటమిన్లు A, C, E, బయోటిన్, ఇనుము, జింక్ లాంటివి జుట్టు ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. శరీరానికి నీరు అవసరమైనంతగా జుట్టుకు కూడా నీరు అవసరం పడుతుంది. రోజుకి 8-10 గ్లాసుల నీరు తాగడం మంచిది. వ్యాయామం శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఫలితంగా జుట్టుకు అవసరమైన పోషకాలు సరైన మొత్తంలో అందుతాయి. నిద్ర లేకపోవడం వల్ల జుట్టు రాలడం ఎక్కువగా ఉంటుంది. బాగా నిద్ర పోవాలి. మనోవేదన, ఒత్తిడి వల్ల జుట్టు రాలడం పెరుగుతుంది. యోగా, మెడిటేషన్ లాంటివి చేయడం ద్వారా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు.

జుట్టు సంరక్షణ
మృదువైన షాంపూ, కండిషనర్ ఉపయోగించండి: సల్ఫేట్స్, పారబెన్స్ లేని మృదువైన షాంపూ, కండిషనర్ మంచివి. రోజూ తలస్నానం చేయడం వల్ల జుట్టు పొడిబారడం, రాలడం జరుగుతుంది. తడి జుట్టును బాగా ఆరబెట్టుకోకపోతే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. హెయిర్ డ్రైయర్, స్ట్రెయిటెనర్, కర్లింగ్ ఐరన్ లాంటివాటిని తరచుగా ఉపయోగించడం వల్ల జుట్టు దెబ్బతింటుంది. పర్మ్, కలర్ లాంటి కెమికల్ ట్రీట్‌మెంట్స్ జుట్టును దెబ్బతీస్తాయి. తలకు మర్దన చేసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఆలివ్ ఆయిల్, నారింజ పండు రసం లాంటి వాటితో మర్దన చేసుకోవచ్చు. జుట్టును గట్టిగా కట్టుకోవడం వల్ల కూడా జుట్టు రాలడం పెరుగుతుంది. అంతేకాకుండా జన్యువులు, హార్మోన్ల అసమతుల్యత, పోషకాహార లోపం, ఒత్తిడి, అనారోగ్యం, కొన్ని మందులు, తలకు ఇన్ఫెక్షన్లు, హెయిర్ స్టైలింగ్, కెమికల్ ట్రీట్‌మెంట్స్ వంటివాటివల్ల కూడా జుట్టు ఊడుతుంటుంది. జుట్టు పెరుగుదలకు బాదం, గుమ్మడికాయ విత్తనాలు, చియా సీడ్స్, అవకాడో, గుడ్లు, పాలకూర, బ్రోకలీ, క్యారెట్, టమాటా లాంటివి తీసుకోవాలి.












Click it and Unblock the Notifications