ప్రధాని మోదీ ఫిట్నెస్ సీక్రెట్.. ఆయన ఏడాదిలో 300రోజులు తినేదిదే!

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు అటువంటి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రధాని నరేంద్రమోదీ అనేక సందర్భాలలో తన మన్ కీ బాత్ కార్యక్రమంలో చెప్పారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిరోజూ ఉదయం శారీరక వ్యాయామంతో పాటు యోగ చేస్తారు. ఆహారం విషయంలో కూడా ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫిజికల్ ఫిట్నెస్ విషయానికి వస్తే ఆయన తినే సూపర్ ఫుడ్ అందుకు కారణమని చెప్పొచ్చు.

తన ఆహారంపై మోదీ ఏమన్నారంటే
ఇక ఇదే విషయాన్ని ఆయన ఇటీవల బీహార్ లోని భాగల్పూర్ లో నిర్వహించిన ర్యాలీలో వెల్లడించారు. తను ఏడాదిలో 300 రోజులు కచ్చితంగా తన ఆహారంలో మఖాన ఉండేలా చూసుకుంటానని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఫూల్ మఖాన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే మంచి పౌష్టికాహారమని ఆయన తెలిపారు. ఫూల్ మఖానను పెద్ద ఎత్తున సాగు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. మఖానా మంచి పోషకాల గని.

Prime Minister Modi fitness secret This is what he eats 300 days a year

మఖానాకు విదేశాలలోనూ డిమాండ్
మఖాన తింటే ఎన్నో లాభాలు ఉంటాయని భారత ప్రధాని నరేంద్రమోదీ కూడా వెల్లడించారు. ఒక్క భారతదేశంలో మాత్రమే కాకుండా విదేశాలలో కూడా ఫూల్ మఖానకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇది చాలా ఆరోగ్యకరమైన ఆహారమని చెబుతారు. ప్రపంచ వ్యాప్తంగా మఖానా సరఫరా లో 90శాతం భారతదేశం నుండే వెళుతుందని, మఖానాలో ఉండే పోషకాలను దృష్టిలో పెట్టుకొని విదేశాలవారు కూడా దీనిని తినడానికి ఆసక్తి చూపిస్తున్నారని ప్రస్తుతం దేశంలో చర్చ జరుగుతుంది.

Prime Minister Modi fitness secret This is what he eats 300 days a year

ఫూల్ మఖానాతో ఈ ఆరోగ్య ప్రయోజనాలు
ఫూల్ మఖాన తింటే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. ఒబేసిటీతో బాధపడేవారు ఊబకాయం నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. మఖానా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది . వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంది. ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే మఖానా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో ఇష్టంగా తినే ఆహారం. ఈయన సంవత్సరంలో 300 రోజులు ఇదే ఆహారాన్ని కచ్చితంగా తింటారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆరోగ్య రహస్యంలో ఇది కూడా కీలకమైనది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+