ముల్లంగి పచ్చడి.. ఇలా చేస్తే సూపర్ టేస్టీ
ముల్లంగిని రోజూ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ముల్లంగి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే శరీరంలోని వ్యర్థాలను తొలగించి, రక్తానికి ఫ్రెష్ ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది. అంతేకాక రక్తపోటును తగ్గించడంలోనూ సాయపడుతుంది. ముల్లంగిలోని ఫైబర్, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. అలాగే ముల్లంగి పచ్చడి ఇలా చేసుకుంటే టేస్టీతోపాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. మరి ముల్లంగి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి? ముల్లంగి పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి..?
ముల్లంగి పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. ముల్లంగి ఒకటి, ఉల్లిగడ్డ ఒకటి చిన్నది, వెల్లుల్లి రెబ్బలు ఐదు, ఎండు మిరపకాయలు పది, పోపుగింజలు రెండు టీస్పూన్లు, నూనె తగినంత, చింతపండు గుజ్జు కొద్దిగా, కరివేపాకు, పసుపు చిటికెడు, ధనియాలు, జీలకర్ర టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత తీసుకోవాలి.
ముల్లంగి పచ్చడి తయారీ విధానం చూస్తే.. ముందుగా ముల్లంగిని శుభ్రంగా కడిగి.. తొక్కతీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టి తగినంత నూనె పోయాలి. నూనె వేడెక్కిన తర్వాత ధనియాలు, జీలకర్ర, ఎండు మిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. సన్నని మంటపై వేయించి తీయాలి.

అదే గిన్నెలో కొద్దిగా నూనె వేసి ముల్లంగి ముక్కల్ని వేసి సన్నని మంటపై వాసనపోయేంత వరకూ వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో అర టీ స్పూన్ పసుపు వేసి కలిపి దించేయాలి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న మిరపకాయల మిశ్రమం, ఉప్పు రుచికి సరిపడా, చింతపండు గుజ్జు మెత్తగా గ్రైండ్ చేశాక.. అందులో ముల్లంగి ముక్కలు వేసుకుని గ్రైండింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనికి పోపు పెడితే సరి.. సూపర్ టేస్టీ ముల్లంగి పచ్చడి సిద్ధం అయినట్లే..












Click it and Unblock the Notifications