కిడ్నీలో స్టోన్స్. రణపాల ఆకు తినాల్సిందే.
కిడ్నీ స్టోన్స్.. ప్రస్తుతం చాలా మంది ఫేస్ చేస్తున్న సమస్య, రక్తంలోని అసమతుల్యత, మలబద్ధకం వంటి సమస్యలను కలిగించే సాధారణ ఆరోగ్య సమస్య. అయినప్పటికి ఇది కలిగించే నొప్పి వర్ణనాతీతం. కత్తితో నరాల్ని చీల్చుతున్న ఫీలింగ్. అయితే ఈ సమస్యకు పురాతన కాలంలోనే సహజసిద్ధమైన జౌషధాలున్నాయి. ఇటీవల ఈ ఆకులపై అధ్యయనాలు కూడా జరిగాయి. అదే రణపాల ఆకు.
శ్రీలంకలోని యూనివర్సిటీ ఆఫ్ జఫ్ని పరిశోధకులు రణపాల ఆకుపై పరిశోధనలు చేశారు. ఈ రీసెర్చ్ ఈ ఆకులోని ఫైటోకెమికల్స్ కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా నిరోధించగలవని స్పష్టంగా నిరూపించింది. రణపాల ఆకులోని పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మరియు ఇతర బయోకెమికల్స్ మూత్రంలోని అధిక కాల్షియం నిల్వలను నియంత్రిస్తూ రాళ్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను అడ్డుకుంటాయి.

అంతేకాకుండా, రణపాల ఆకులోని ఫైటోన్యూట్రియంట్స్ కిడ్నీ కణజాలాన్ని పునరుద్ధరించడంలో సహాయపడతాయి. కిడ్నీ స్టోన్స్ వల్ల దెబ్బతిన్న కణాలు, రేణు కణజాలం మళ్ళీ ఆరోగ్యవంతంగా మారేలా రణపాల ఆకులోని ప్రత్యేక సమ్మేళనం సహకరిస్తుంది. ఈ కారణాల వల్ల రణపాల ఆకును కిడ్నీ స్టోన్స్ నిరోధించండంలో, స్టోన్స్ ఉన్నవారిలో వాటి పెరుగుదలను అడ్డుకునే విధంగా ఉపయోగించవచ్చు.
దెబ్బలకు సైతం మందులా..
రుణపాల ఆకులోని ఆరోగ్య లక్షణాలు కేవలం కిడ్నీ కోసం మాత్రమే పరిమితం కాదు. దెబ్బతిన్న గాయాలు, పుళ్లు, గ్యాంగ్రిన్ వంటి సమస్యల్లో కూడా ఇది సహాయపడుతుంది. గ్యాంగ్రిన్ వల్ల పుళ్లు మానకమని, స్పర్శ కోల్పోయిన భాగాల్లో రణపాల ఆకుపేస్ట్ పసుపుతో కలిపి రాస్తే, వేర్వేరు రకాల కెమికల్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్ లక్షణాలు సమస్యను త్వరగా తగ్గిస్తాయి.
చెవిలో ఇన్ఫెక్షన్ కు కూడా..
చెవి సమస్యల విషయంలో కూడా రణపాల ఆకు ఉపయోగకరంగా ఉంటుంది. చెవిలో ఇన్ఫెక్షన్, నొప్పి, చీముగా సమస్యలు వచ్చినప్పుడు రణపాల ఆకుపసరును వడగట్టి చెవిలో వేయడం ద్వారా ఉపశమనం లభిస్తుంది. ఇందులోని యాంటీ‑బ్యాక్టీరియల్ లక్షణాలు ఇన్ఫెక్షన్ వ్యాప్తిని ఆపి నొప్పిని తగ్గిస్తాయి.
గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా పెరుగుతున్న రణపాల ఆకు ఆన్‌లైన్ ద్వారా కూడా సులభంగా లభిస్తుంది. దానిని ఉపయోగించడానికి నాలుగు‑ఐదు ఆకులను 100 మి.లీ నీటిలో మరిగించి, వడగట్టి, డికాక్షన్ తయారుచేయాలి. తీపి కావలసిన అవసరం ఉంటే తేనె, చెరుకు పానకం లేదా ఖర్జూరం పేస్ట్ కలిపి సేవించవచ్చు. పచ్చి రసాన్ని నేరుగా వాడకూడదు, డికాక్షన్ రూపంలో తీసుకోవడం మేలు.
శాస్త్రీయంగా కూడా రణపాల ఆకులోని ఫైటోకెమికల్స్ మరియు పాలీఫెనాల్స్ కిడ్నీ స్టోన్స్ ఫార్మేషన్ నిరోధంలో, కణజాల పునరుద్ధరణలో, ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో, యాంటీ మైక్రోబియల్ లక్షణాల ద్వారా వ్యాధి నియంత్రణలో సహాయపడతాయని 2013లోనే యూనివర్సిటీ ఆఫ్ జఫ్ని పరిశోధకులు నిరూపించగా, అనేక ఇతర పరిశోధనలు కూడా దీని ఉపయోగాలను ధృవీకరించాయి.












Click it and Unblock the Notifications