ప్రభాస్ కు ఇష్టమైన 'బెండకాయ రొయ్యల పులుసు'.. ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ భోజన ప్రియుడని మనకు తెలిసిందే. అంతేకాక ఆయన ఇంటికి ఎవరు వచ్చినా రాజుల భోజనం పెడతారు. ఆయన షూటింగ్ కు వెళ్లినా.. అక్కడ టీమ్ అందరికి.. తాను తినే ఫుడ్ నే పెట్టిస్తుంటారు. ఇదే విషయాన్ని ప్రభాస్ తో పనిచేసిన చాలా మంది సెలబ్రిటీలు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇక ప్రభాస్ కు ఇష్టమైన ఆహారంలో బెండకాయ రొయ్యల పులుసు ఒకటి. డార్లింగ్ ఇంట్లో బెండకాయ రొయ్యల పులుసు కచ్చితంగా ఉండాల్సిందేనట. అలాగే గోదావరి జిల్లాల ప్రజలకూ ఈ వంటను లొట్టలేసుకుంటూ తింటారట. మరి ఈ వంటను ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇక బెండకాయ రొయ్యల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, ఈ వంటను ఎలా చేయాలి అని ఓ సారి చూస్తే.. ఎండు రొయ్యలు ఒక కప్పు తీసుకోవాలి. ఉల్లిపాయ ఒకటి, వేయించిన బెండకాయ ముక్కలు ఒక కప్పు ఉండాలి. పచ్చి మిరపకాయలు 3 ఉండాలి. కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి 1 టీ స్పూను తీసుకోవాలి. అలాగే వేయించిన జీడిపప్పు కూడా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. అలాగే చింతపండు రసం తగినంత, ధనియాల పొడి 1 టీస్పూన్ తీసుకోవాలి. అప్పటికే నీటిలో నాన బెట్టుకున్న ఎండు రొయ్యల్ని చక్కగా తడి ఆరేంత వరకూ చూసి.. లైట్ గా వేయించుకుని పెట్టుకోవాలి. అలాగే పచ్చి బెండకాయల్ని పొడవాటి ముక్కలుగా కట్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
తయారీ విధానం ఓ సారి చూస్తే.. ముందుగా స్టవ్ పై గిన్నె పెట్టుకుని మూడు స్పూన్ లో నూనె పోసుకోవాలి. ఆయిల్ వేడి కాగానే పోపు గింజలు వేయాలి. ఆ తర్వాత ఒక ఉల్లిపాయను కట్ చేసి ముక్కలు వేయాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు, కొద్దిగా పచ్చి మిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఆ తర్వాత దాంట్లో వేయించుకున్న ఎండు రొయ్యల్ని వేసి కలుపుకోవాలి.

ఆ తర్వాత అందులో తగినంత కారం వేయాలి. తర్వాత తగినంత ఉప్పును వేసుకోవాలి. దగ్గరికి ఉడికాక అందులో చింతపండు రసం పోయాలి. అలా మీడియం ఫ్లేమ్ లో దగ్గరికి వచ్చేవరకూ ఉడికించుకోవాలి. ఆ తర్వాత వేయించిన బెండకాయ ముక్కల్ని అందులో కలుపుకోవాలి. ఆ తర్వాత ధనియాల పొడి, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. దీంతో ఘుమఘుమలాడే బెండకాయ రొయ్యల పులుసు రెడీ అయినట్లే.












Click it and Unblock the Notifications