రెస్టారెంట్ స్టైల్ లో చికెన్ కర్రీ.. ఎలా చేసుకోవాలంటే..?
చికెన్ కర్రీ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. చికెన్ ను ఎలా చేసుకున్నా బాగానే ఉంటుంది. చికెన్ ను పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. చికెన్ తో రకరకాల వంటకాలు చేసుకుంటారు. అయితే రెస్టారెంట్ స్టైల్ లో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి..
రెస్టారెంట్ స్టైల్ లో చికెన్ కర్రీ చేసుకోవాలంటే కావాల్సిన పదార్థాలు ఓసారి చూస్తే.. చికెన్ కిలో తీసుకోవాలి.. తరిగిన ఉల్లిపాయలు పెద్దవి 2, ఎండు మిర్చి 7, కరివేపాకు రెండు రెబ్బలు, కొత్తిమీర తరిగిన.. ధనియాలు టేబుల్ స్పూన్, జీలకర్ర- అర టీ స్పూన్, లవంగాలు 2, యాలకులు 2, దాల్చిన చెక్క తగినంత, అల్లం వెల్లుల్లి పేస్టు- ఒక టేబుల్ స్పూన్, కారం- ఒక టీ స్పూన్, పసుపు- తగినంత, ఉప్పు రుచికి సరిపడా, పెరుగు తగినంత, నూనె- కావాల్సినంత, నిమ్మకాయ- 1 తీసుకోవాలి.
తయారీ విధానం ఓసారి చూస్తే.. మొదట చికెన్ ను బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అందులో కొంచెం పెరుగు, కారం, ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఆ చికెన్ ను మారినేట్ చేసి పెట్టుకోవాలి. మరోవైపు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో చికెన్ మసాలా రెడీ చేసుకోవడానికి గల పదార్థాలు అయిన ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత అవి చల్లారిన తర్వాత మిక్సీలో వీటిని వేసుకుని మసాలా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు మరో గిన్నె స్టవ్ మీద పెట్టుకుని నూనె పోసి నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకుని వేయించుకోవాలి. అందులో అల్లం పేస్టు వేసి.. పచ్చి వాసన పోయే వరకూ వేయించుకోవాలి. ఆ మిశ్రమంలో పసుపు వేసుకుని మారినేట్ చేసుకున్న చికెన్ ను వేయాలి. చికెన్ ఉడికాక అందులో కారం వేసుకోవాలి. కొన్ని నిమిషాల పాటు అలా ఉడికించుకోవాలి. అనంతరం నూనే తేలేవరకూ సిమ్ లో పెట్టి వేడి చేసుకోవాలి. తతర్వాత చికెన్ లో తరిగిన కొత్తిమీరను వేసుకుని స్టౌ ఆఫ్ చేసుకోవాలి. అంతే రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయినట్లే..
-
"గోంగూర పప్పు" ఇలా ట్రై చేస్తే ప్లేట్ ఖాళీనే.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications