రెస్టారెంట్ స్టైల్ సాంబార్ రైస్.. ఇలా చేస్తే మళ్ళీ మళ్ళీ తింటారు

సాంబార్ రైస్.. మనం ఇంట్లో తయారు చేసుకునే సాంబార్ రైస్ కు, రెస్టారెంట్ లో తయారుచేసే సాంబార్ రైస్ కు చాలా తేడా ఉంటుంది. రెస్టారెంట్ లో తయారు చేసే సాంబార్ రైస్ రుచిలో కూడా తేడా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్ లో మనం ఇంట్లోనే సాంబార్ రైస్ తయారీకి ఎలాంటి టిప్స్ ను పాటించాలి? మళ్లీ మళ్లీ చేసుకొని తినాలనిపించే సాంబార్ రైస్ ను ఎలా తయారుచేయాలో చూద్దాం.

సాంబార్ రైస్ తయారీకి కావలసిన పదార్థాలు

బియ్యం- ఒక కప్పు
కందిపప్పు- అరకప్పు
నీళ్లు- ఆరు నుండి ఏడు కప్పులు
కూరగాయలు- టమాటాలు, క్యారెట్, బెండకాయ, మునక్కాయ, ఉల్లిపాయలు
చింతపండు రసం- అరకప్పు
సాంబార్ పొడి- రెండు నుండి మూడు టీ స్పూన్లు
నెయ్యి- 4 టేబుల్ స్పూన్లు
నూనె- మూడు టేబుల్ స్పూన్లు
పోపు గింజలు- ఒక స్పూన్
ఉప్పు- రుచికి సరిపడా

Restaurant-style sambar rice if you make it this way you ll want to eat it again and again know the tips

తయారీ విధానం:

బియ్యం, కందిపప్పును బాగా కడిగి నాలుగు కప్పులు నీళ్లు పోసి ప్రెషర్ కుక్కర్లో నాలుగు విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టౌ పైన ఒక పాన్ పెట్టి అందులో రెండు స్పూన్ల నెయ్యి వేడి చేసి, పోపు గింజలు వేసి, కరివేపాకు, ఇంగువ వేసి వేయించి ఆపై అందులో ఉల్లిపాయలు, టమాటాలు, ఇతర కూరగాయల ముక్కలను వేసి బాగా మగ్గించాలి.

సాంబార్ రైస్ సీక్రెట్ ఇదే

మగ్గిన కూరగాయలలో పసుపును, నెయ్యిలో వేయించిన సాంబార్ పౌడర్ ను, తగినంత ఉప్పును, వేసి బాగా మిక్స్ చేసి, అందులో చింతపండు రసాన్ని పోయాలి. ఆపై కూరగాయ ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలి. కూరగాయ ముక్కలు ఉడికాయని నిర్ధారించుకున్న తర్వాత అందులో మెత్తగా ఉడికిన పప్పు, అన్నం మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. ఇదే సమయంలో రెండు చెంచాల నెయ్యి వేస్తే సాంబార్ రైస్ ఘుమఘుమలాడుతుంది.

రెస్టారెంట్ స్టైల్ సాంబార్ రైస్ రెడీ

సాంబార్ రైస్ చిక్కదనం చూసుకుని బాగా దగ్గరగా ఉంది అని భావిస్తే, కాస్త పలుచగా చేసుకోవడానికి కొద్దిగా నీటిని యాడ్ చేయవచ్చు. దీన్ని సిమ్ లో పెట్టి బాగా ఉడికించి కొత్తిమీరతో గార్నిష్ చేసి, పైన కొద్దిగా నెయ్యి వేశారంటే రుచికరమైన రెస్టారెంట్ స్టైల్ సాంబార్ రైస్ రెడీ అయినట్టే. ఇక దీనిని నేరుగా ప్లేట్లో పెట్టుకుని తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+