బియ్యం కడిగిన నీళ్ళు పారబోస్తున్నారా? ఇవి తెలుసుకోండి!
చాలామంది బియ్యం కడిగిన నీళ్లను పారబోస్తూ ఉంటారు. అయితే బియ్యం కడిగిన నీళ్లు పారబోయడం కంటే ఆ నీటిని ఉపయోగించుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. బియ్యం కడిగిన నీళ్లల్లో బోలెడన్ని పోషకాలు ఉంటాయని ముఖ్యంగా బీ విటమిన్, ఈ విటమిన్, ఫాస్ఫరస్, పొటాషియంతో పాటు కొద్దిపాటి గంజి కూడా ఉంటుందని చెబుతున్నారు.
బియ్యం కడిగిన నీళ్ళతో బోలెడు ప్రయోజనాలు
బియ్యం కడిగిన నీళ్లను ఉపయోగించడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని, ఇది మన జుట్టుకు కూడా మంచి ప్రయోజనాలను చేకూరుస్తుందని చెబుతున్నారు. మన ప్రధాన ఆహారమైన అన్నం వండేందుకు బియ్యాన్ని కడిగినప్పుడు ఆ కడిగిన నీటిని సహజంగా మనం పారబోస్తాము .అయితే అలా పారబోయకుండా ఆ నీటిని మళ్లీ మనం ఉపయోగించుకోవడం వల్ల లాభాలు చేకూరుతాయి.

జుట్టు ఆరోగ్యానికి బియ్యం కడిగిన నీళ్లు
ముఖ్యంగా మన జుట్టు ఆరోగ్యానికి బియ్యం కడిగిన నీళ్లు ఉపయోగపడతాయి.బియ్యం కడిగిన నీళ్లల్లో ఉండే అమైనో ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు మన జుట్టు సంరక్షణకు ఎంతగానో దోహదం చేస్తాయి. శుభ్రంగా తల స్నానం చేసిన తర్వాత జుట్టు పైన బియ్యం కడిగిన నీళ్లను పోసి మసాజ్ చేసుకుంటే అందులో ఉండే పోషకాలు మన జుట్టు కుదుళ్ళకు అందుతాయి. దీనివల్ల జుట్టు ఊడిపోవడం, చిట్లిపోవడం, సున్నితంగా మారడం వంటి సమస్యలు తగ్గుతాయి.
చర్మ ఆరోగ్యం కోసం బియ్యం కడిగిన నీళ్లు
అంతేకాదు మన జుట్టు కూడా నిగారింపును సొంతం చేసుకుంటుంది. బియ్యం కడిగిన నీళ్లలో ఇనోసిటాల్, ఫిట్కి ఆసిడ్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మన చర్మాన్ని మృదువుగా మెరిసేలా చేస్తాయి. ముఖ్యంగా చర్మం రక్షించి తేమను ఇచ్చి చర్మం వాపును తగ్గిస్తాయి చర్మానికి బియ్యం కడిగిన నీళ్లు ఎంతో మంచిది. ఇక బియ్యం కడిగిన నీళ్లను మరిగించి వాటిని తాగితే అవి మన జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి మలబద్దకాన్ని అజీర్తిని నివారిస్తాయి.
బియ్యం కడిగిన నీళ్లతో ఆరోగ్య ప్రయోజనాలిలా
బియ్యం కడిగిన నీళ్లలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఈ నీటిని మరిగించి తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కాబట్టి బరువు తగ్గడానికి కూడా ఇది దోహదం చేస్తుంది. బియ్యం కడిగిన నీళ్లు గుండె ఆరోగ్యానికి మంచి చేస్తాయి. రక్తపోటును తగ్గిస్తాయి. మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి కూడా ఉపయోగపడతాయి. మన శరీరానికి కావలసిన శక్తిని ఇస్తాయి. ఇంతకుముందు అన్నాన్ని వండేటప్పుడు గంజిని వార్చి ఆ గంజిని తాగే వాళ్ళు. గంజిని తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన శక్తి రావడమే కాక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగేవి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications