గంజి తాగడంవల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా?
మన పూర్వీకులు మనకన్నా ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. అందుకు కారణం.. వారి ఆహారపు అలవాట్లు. ప్రస్తుతం మనం అన్నం వండినప్పుడు గంజిని పారబోస్తుంటాం. కానీ పూర్వీకులు ఆ గంజిలో ఉప్పు, నిమ్మరసం కలుపుకొని తాగేవారు. దీనివల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. మన పూర్వీకులు మనకన్నా బలిష్టంగా ఉండటానికి ఇది కూడా ఒక కారణం.
గంజిని మనం పనికిరానిదని భావించి పారబోస్తుంటాం. ఇందులో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి. బి, ఇ, సి విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. అతిసారం, కడుపునొప్పి లాంటివాటితో ఇబ్బంది పడుతుంటే చిన్న గ్లాసులో పలచటి గంజి తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే పిండి పదార్థం బైండింగ్ ఏజంట్ గా పనిచేస్తుంది.

ఎలక్ట్రోలైట్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. డీహైడ్రేషన్, అలసటను తగ్గిస్తుంది. గంజిలో బి, ఐరన్, జింక్, మెగ్నీషియం వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రతిరోజు తీసుకుంటే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. మహిళలకు నెలసరి నొప్పులను తగ్గిస్తుంది.ఇందులో ఉండే రిలాక్సింగ్ లక్షణాలు కండరాల సంకోచాల ఉపశమనానికి ఉపయోగపడతాయి. బరువు తగ్గాలనుకునేవారు గంజి తాగితే ఉపయోగం. ఇందులో క్యాలరీలు తక్కువ. గ్లాసు గంజి తాగితే ఎక్కువ సమయం ఆకలి వేయకుండా ఉంటుంది.
వేసవిలో శక్తి త్వరగా ఆవిరైపోతుంటుంది. అలాంటి వారు గంజి తాగడంవల్ల తక్షణమే శక్తిని పుంజుకుంటారు. గంజి నీటిలో బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. పసిపిల్లలు పాలు సరిగ్గా తాగకపోతే వారికి కనీసం గంజి నీటినైనా తాగించాలి. దీనివల్ల వారు కోల్పోయే విటమిన్స్, మినరల్స్ తిరిగి పొందుతారు. విరేచనాలు అవుతుంటే గంజి నీటిని తాగితే వెంటనే విరేచనాలు తగ్గుతాయి.












Click it and Unblock the Notifications