కంట్లో పదునైన నొప్పి.. కారణాలివే కావచ్చు.. నిర్లక్ష్యం చెయ్యొద్దు!
సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. మన శరీర భాగాలలో కళ్ళు అత్యంత ముఖ్యమైనవి. కంటి చూపు బాగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం. అటువంటి కళ్ళు తరచుగా ఇబ్బంది పెడుతుంటే, కళ్ళల్లో చాలా పదునైన నొప్పి వస్తుంటే దానికి గల కారణాలను తెలుసుకోవాలి. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. కంటిలో కత్తితో పొడిచినట్టు వచ్చే నొప్పికి అనేక కారణాలు ఉంటాయి. ప్రస్తుతం మనం ఆ కారణాలను గురించి తెలుసుకుందాం.
తీవ్రమైన కంటి నొప్పి వెనుక కారణం ఇదే కావచ్చు
కొన్ని రకాల తలనొప్పులు కూడా విపరీతమైన కంటి నొప్పికి కారణమవుతాయి. అందులో క్లస్టర్ తలనొప్పి ఒకటి. కంట్లో విపరీతమైన నొప్పికి క్లస్టర్ తలనొప్పి కూడా కారణం కావచ్చు. సైనస్ తలనొప్పి, మైగ్రేన్ తలనొప్పి, హైపర్ టెన్షన్ తో వచ్చే తలనొప్పి ఇలా రకరకాల తలనొప్పులు కూడా కంటిపైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ తలనొప్పుల కారణంగా కూడా కన్ను చుట్టూ, కన్ను వెనక కేంద్రీకృతమై ఉన్న భాగం ప్రభావితం అవుతుంది.

క్లస్టర్ తలనొప్పి ప్రభావం కళ్ళపైన
తీవ్రమైన బాధాకరమైన నొప్పి పదునైన కత్తిపోటు లాగా అనిపిస్తుంది. కొంతమందిలో ఇది నెలలు, సంవత్సరాల పాటు కూడా కొనసాగుతుంది. ఈ క్లస్టర్ తలనొప్పిని అసలు నిర్లక్ష్యం చేయకూడదు. క్లస్టర్ తలనొప్పి ప్రతిరోజు ఖచ్చితమైన సమయంలోనే వస్తుంది. ఈ తలనొప్పితో సరిగ్గా నిద్ర కూడా పట్టదు. నిద్ర భంగం అవుతూ ఉంటుంది. క్లస్టర్ తలనొప్పి వచ్చినవారికి కళ్ళ పైన ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
కళ్ళలో ఈ లక్షణాలు ఉంటే క్లస్టర్ తలనొప్పి కావచ్చు
కళ్ళు వాపు రావడం, కళ్ళు ఎర్రబడడం, రెప్పలు వాలిపోవడం, నీరు కారడం, ముక్కు కారడం, చెమటలు పట్టడం, ముఖం ఎర్రబడడం వంటి అనేక లక్షణాలు క్లస్టర్ తలనొప్పి కారణంగా కనిపిస్తాయి. ఈ క్లస్టర్ తలనొప్పి వచ్చినప్పుడు విపరీతమైన ఆందోళన ఉంటుంది. క్లస్టర్ తలనొప్పి తో బాధపడేవారు ఏదైనా వెలుతురును చూసినా, కొంచెం పెద్ద శబ్దాలు విన్న చాలా సున్నితంగా ఫీల్ అవుతారు. చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతారు.
క్లస్టర్ తలనొప్పిని నిర్లక్ష్యం చెయ్యొద్దు
క్లస్టర్ తలనొప్పికి ఆక్సిజన్ థెరపీ చాలా బాగా పనిచేస్తుంది. దీనికి మందులు వాడడంతో పాటు నొప్పిని తగ్గించే ఇతర ప్రత్యామ్నాయాలను కూడా ట్రై చేయాల్సి ఉంటుంది. క్లస్టర్ తలనొప్పి కంటి సమస్యలకు కారణం అవుతుంది. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. కళ్ళను ఎఫెక్ట్ చేసే ఏ అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
మళ్లీ మళ్లీ తినాలనిపించే "పీతల బిర్యానీ" ఎలా చేయాలంటే..? -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి












Click it and Unblock the Notifications