Cooldrinks: వేడిగా ఉందని కూల్‍డ్రింక్స్ తాగుతున్నారా.. అయితే ప్రమాదంలో పడినట్లే..!
ఎండా కాలం రాగానే చాలా మంది ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. అయితే శీతాలపానీయాలు మనకు తెలియకుండానే మన శరీరంపై ప్రభావం చూపుతాయి. కూల్ డ్రింక్స్ అదే పనిగా తాగడం వల్ల మధుమేహ సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. తరుచుగా కూల్ డ్రింక్స్ తాగితే టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాసం ఉందట. శీతాలపానీయాల్లో ఉండే పాస్ఫారిక్ యాసిడ్ వల్ల ఎముకల్లో కాల్షియం తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు. దీనివల్ల మనకు ఎముకల తీవ్రంగా బలహీనపడతాయి.
కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల దంతాలు కూడా బలహీనపడే అవకాశం ఉంటుందట. కూల్ డ్రింక్స్ తాగని వారి దంతాల కంటే, కూల్ డ్రింక్స్ తాగే వారి దంతాలు తొందరగా ఊడిపోతాయని చెబుతున్నారు. శీతాలపానియాల్లో అధిక కేలరీలు, షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల బరువు పెరుగుతారు. కూల్ డ్రింక్స్ లో ఉండే కెఫిన్ వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగే వారిలో హైబీపీ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగే వారిలో గుండె పనితీరు మందగిస్తుందని, హార్ట్ ఎటాక్ లేదా ఇతర సమస్యల పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గర్భవతులుగా ఉన్న మహిళలు ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగితే గర్భ స్రావం అయ్యే ప్రమాదం కూడా ఉందట. కూల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల గ్యాస్, ఎసిడిటీ సమస్యలు రెట్టింపు అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
అందుకే సమ్మర్ లో నీరు ఎక్కువగా ఉండే దోసకాయ, వాటర్ మిలన్ తీసుకోవాలని సూచిస్తున్నారు. కూల్ డ్రింక్స్ బదులుగా జ్యూస్ తాగాలని చెబుతున్నారు. ఎండకాలం మజ్జి తాగితే మంచిదని వివరిస్తున్నారు. వీటన్నింటికన్నా ముఖ్యంగా నీళ్లు తాగాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications