చర్మం, జుట్టు, గోళ్ళు.. అందం ఆరోగ్యం కోసం ఇవి తినండి
మనలో చాలామంది జుట్టు, చర్మం, గోళ్లు మొదలైన వాటి గురించి తెగ బాధపడుతూ ఉంటారు. జుట్టు ఆరోగ్యంగా పెరగడం లేదని తరచూ జుట్టు రాలిపోతుందని, జుట్టు నిర్జీవంగా మారుతుందని బాధపడతారు. ఇక చర్మం కూడా ఆరోగ్యంగా లేదని ఇబ్బంది పడేవారు లేకపోలేదు. గోళ్ళు కూడా అందంగా పెరగాలని ఆలోచించే వాళ్ళు లేకపోలేదు. అయితే జుట్టు, చర్మం, గోళ్లు ఆరోగ్యం కోసం, అందం కోసం మనం కొన్ని ఆహారాలను తీసుకోవలసిన అవసరం ఉంది.
బయోటిన్ నిండిన ఆహారాలతో స్కిన్, జుట్టు, గోళ్ళకు అందం
ముఖ్యంగా బయోటిన్ నిండిన ఆహారాలను తీసుకుంటే మన చర్మం జుట్టు బాగా కనిపిస్తాయి. బయోటిన్ బి విటమిన్ గ్రూప్ లో ఒక భాగం. ఇది మన జుట్టు, చర్మం, కళ్ళు, మెదడు, గోర్లు మొదలైన ముఖ్యమైన అవయవాలకు ఎంతో బాగా పనిచేస్తుంది. ఇక చర్మ సౌందర్యం కోసం, జుట్టు ఆరోగ్యం కోసం, అందమైన గోళ్ళ కోసం మనకు ఎంతగానో ఉపయోగపడే పోషకాలతో నిండిన ఆహారాల జాబితాను ప్రస్తుతం తెలుసుకుందాం.

వీటిని తింటే చర్మానికి మంచిది
గుడ్డు పచ్చ సొనలో బయోటిన్ ఒక అద్భుతమైన మూలంగా ఉంటుంది. బయోటిన్ బలమైన జుట్టుకు, గోళ్ళకు అవసరమైన ప్రోటీన్ ను అందిస్తుంది. గుప్పెడు బాదం పప్పు తింటే మన శరీరానికి కావలసిన మంచి మొత్తంలో బయోటిన్ అందుతుంది. అలాగే చర్మానికి ప్రయోజనం చేకూరుతుంది. దీంతో ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా లభిస్తాయి. ఆరోగ్యానికి జుట్టు పెరుగుదలకు ఎంతగానో దోహదం చేస్తాయి.
ఆకుకూరలు, చేపలతోనూ మూడు బెనిఫిట్స్
సాల్మన్ చేపలో బయోటిన్ మాత్రమే కాదు ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. ఇవి చర్మానికి, జుట్టుకి కూడా మేలు చేస్తాయి .ఆకుకూరల్లో కూడా పోషకాలు అధికంగా ఉంటాయి. ఆకుకూరలలో బయోటిన్ తో పాటు ఇతర విటమిన్లు కూడా ఉండడం వలన ఇవి ఆరోగ్యకరమైన చర్మం మరియు బలమైన గోళ్ళకు దోహదం చేస్తాయి. కనుక పైన పేర్కొన్న ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకుంటే మీకు మూడు ప్రయోజనాలు కలుగుతాయి. ఆ ప్రయోజనాలు మీ మనసుకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి.












Click it and Unblock the Notifications