గురక సమస్యకు ఈ సహజ చిట్కాలతో నివారణ!!
చాలామంది గురకతో తెగ బాధ పడుతూ ఉంటారు. గురక పెట్టే వాళ్ళ కంటే పక్కనే పడుకున్న వాళ్ళు దానివల్ల ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. అసలు ఈ గురక ఎందుకు వస్తుంది? గురక తగ్గాలంటే ఎటువంటి చిట్కాలను పాటించాలి? ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
గురక తగ్గాలంటే బరువు తగ్గాలి
అధిక బరువు ఉన్న వారిలో గురక సమస్య ఎక్కువగా ఉంటుంది. కనుక గురక తగ్గాలంటే బరువు తగ్గేందుకు ప్రయత్నించాలి. ఇక గురక తగ్గాలి అని భావించేవారు ప్రతిరోజు కాస్త అల్లాన్ని ఏదో ఒక రకంగా ఆహారంలో భాగం చేసుకోవాలి. అల్లం లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ లు ఉండడం వల్ల ఇది గురక నుండి ఉపశమనం పొందడానికి ఉపయోగపడుతుంది.

వీటితో గురక నుండి ఉపశమనం
ఉల్లిపాయ, వెల్లుల్లి, ముల్లంగి తింటే గురక సమస్య తగ్గుతుంది.రోజూ ఆహారంలో వీటిని భాగం చేసుకుంటే మంచిది. అంతేకాదు వెల్లుల్లి రసం తాగితే గురకను నివారించవచ్చు. పైనాపిల్, అరటిపండు, కమలాపండ్లలో మెలటోనిన్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ పండ్లను ఎక్కువగా తీసుకుంటే గురక సమస్య తగ్గుతుంది.
గురకను నివారించాలంటే రాత్రి ఇలా చెయ్యండి
గురక తగ్గాలంటే అర టీ స్పూన్ తేనె, అర టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగడం వల్ల గురక తగ్గుతుంది. అంతేకాదు నిద్రలేమి సమస్యను, గురకను నివారించడానికి పుదీనా బాగా పనిచేస్తుంది. పుదీనా నూనెను కానీ, గోరువెచ్చని నీటిలో పుదీనా ఆకులను కానీ వేసుకొని తీసుకుంటే గురక నుంచి ఉపశమనం దొరుకుతుంది.
గురక ఇలా చేస్తే తగ్గే అవకాశం ఉంది
రాత్రిపూట నిద్ర పోయే ముందు గోరువెచ్చని గ్లాసు నీళ్ళలో కొద్దిగా యాలకుల పొడి కలుపుకుని తాగితే గురక నిదానంగా తగ్గుతుంది. నిద్ర పోయే ముందు ఒక చెంచా తేనెలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి కలుపుకొని తీసుకోవడం వల్ల కూడా విపరీతమైన గురక నుండి ఉపశమనం లభిస్తుంది. పెప్పర్మింట్ ఆయిల్ ను చేతికి రాసుకుని రాత్రి పడుకునే ముందు బాగా వాసన చూస్తే గురక తగ్గుతుంది.
గురక ప్రమాదం... జాగ్రత్త
కనుక గురక బాగా వచ్చేవాళ్ళు ఈ టిప్స్ ను ట్రై చేస్తే మంచిది. అప్పటికి గురక తగ్గకుంటే కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాల్సిందే. కానీ గురకను అసలే నిర్లక్ష్యం చెయ్యొద్దు.. ఇది ఒక్కోసారి మన ప్రాణాలకే ప్రమాదం తీసుకురావచ్చు. కనుక గురక విషయంలో జాగ్రత్త.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications