అరటి తొక్కే కదా అని పారేస్తున్నారా..? ఈ ప్రయోజనాలు మిస్​ అయినట్లే..!

అరటిపండులో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి వెంటనే శక్తిని అందిస్తాయి. పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల, ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అయితే అందరూ అరటిపండును తిని తొక్కను పడేస్తుంటారు. కానీ అరటి తొక్క వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా..?

దంతాలు తెల్లగా..

పండిన అరటి తొక్కలో పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం ఉంటాయి. ఇవి మీ దంతాలపై ఉన్న పసుపు మరకలను తొలగిస్తాయి. దాంతో పళ్లను ప్రకాశవంతంగా, తెల్లగా మార్చడంలో సహాయపడతాయి. అరటిపండు తొక్క లోపలి భాగాన్ని మీ దంతాల పై సన్నని పేస్ట్ ఏర్పడే వరకు రుద్దండి. ఆ తర్వాత టూత్ బ్రష్‌ ను తీసుకుని ఆ పేస్ట్‌ ను రుద్దండి. అలా ప్రతిరోజు రెండు వారాలపాటు చేయండి.

క్యాన్సర్ మాయం

అరటిపండు తొక్కల్లో పాలీఫెనాల్స్, కెరోటినాయిడ్లు, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవి క్యాన్సర్ కారక ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని కాపాడడంలో చాలా బాగా సహాయపడతాయని వివరిస్తున్నారు. అంతేకాక ఈ తొక్కలను ఎక్కువగా తీసుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్ స్థాయిలు పెరిగి క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

Stop Tossing Banana Peels Unlock These Surprising Health Benefits

కళ్ల కింద వాపు తగ్గిస్తుంది..

అరటి పండ్లలో ఉన్న విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా, తేమగా మార్చడంలో సాయపడతాయి. అలాగే ఇవి అకాల వృద్ధాప్య సంకేతాలను కూడా నివారిస్తాయి. ఇక అరటి తొక్కలు.. కంటి కింద ఉబ్బడం, నల్లటి మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి. తొక్కను చిన్న ముక్కలుగా కట్ చేసి.. వాటిని కంటి కింద 15 నిమిషాలు ఉంచండి. అనంతరం తేలికపాటి క్లెన్సర్‌ తో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

కొలెస్ట్రాల్​ తగ్గించవచ్చు

అరటి తొక్కలతో కొలెస్ట్రాల్​ ను కూడా తగ్గించవచ్చు. అరటి తొక్కలో కరిగే, కరగని ఫైబర్​లను ఉంటాయి. వీటితో పాటు అరటిలోని పోషకాలు కొలెస్ట్రాల్​ ను తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా గుండె సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.

అలాగే అరటి తొక్కలను సహజంగా బూట్ల పాలిషింగ్ కోసం ఉపయోగించవచ్చు. వెండి ఆభరణాలను పాలిష్ చేయడానికి వినియోగించుకోవచ్చు. అలాగే అరటి తొక్క లోపలి భాగాన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల మంటను తగ్గించి, చికాకుగా ఉన్న చర్మానికి ఉప‌శ‌మ‌నాన్ని కలిగిస్తుందట. అంతేకాదు చర్మంపై ఉన్న ముడతలను తగ్గించి యవ్వనంగా కనిపించేలా సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+