స్ట్రెస్ బాల్ నొక్కుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి!
ప్రస్తుత రోజుల్లో ప్రజల జీవనశైలి మారడంతోపాటు ఆహారపు అలవాట్లు కూడా మారిపోయాయి. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై చిన్న కుటుంబాలే ఉండటంతో చిన్నతనం నుంచి పిల్లల మనస్తత్వాలను దృఢంగా తయారయ్యేలా కథలు చెప్పే అమ్మమ్మలు, తాతయ్యలు ఇప్పుడు ఉండటంలేదు. ఫోన్లతో ఆడుకోవడంవల్ల శారీరక శ్రమలేకుండా పోతోంది. దీనివల్ల చిన్న చిన్న విషయాలను కూడా తట్టుకోలేని మనస్తత్వాలు అలవడుతున్నాయి. చిన్న విషయానికి కూడా ఒత్తిడికి గురవుతున్నారు. చదువులో ఒత్తిడి.. ఉద్యోగంలో ఒత్తిడి.. ఇలా అన్నిరకాలుగా ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవడం కూడా ఎక్కువవుతున్నాయి.
స్ట్రెస్ బాల్ ఉపయోగాలు
ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగించే చిన్న, మృదువైన బంతి. ఇది చూడడానికి చాలా సాధారణంగా ఉన్నప్పటికీ, దీని వల్ల కలిగే ప్రయోజనాలు మాత్రం చాలా ఎక్కువ. స్ట్రెస్ బాల్‌ను నొక్కుతుండటంవల్ల శరీరంలోని ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచి, ఆందోళనను తగ్గిస్తుంది. స్ట్రెస్ బాల్‌ను కుదించడం వల్ల చేతి కండరాలకు మసాజ్ లాంటి అనుభూతి కలుగుతుంది. దీనివల్ల కండరాలు విశ్రాంతి పొంది, నొప్పులు తగ్గుతాయి. స్ట్రెస్ బాల్‌ను ఉపయోగించడం వల్ల మనస్సు ఒకే పనిపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది. ఇది పని చేసేటప్పుడు లేదా చదువుకునేటప్పుడు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఏకాగ్రత పెరుగుతుంది
రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. స్ట్రెస్ బాల్‌ను నొక్కడంవల్ల చేతులలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది చేతులలోని నరాలకు మంచిది. స్ట్రెస్ బాల్‌ను ఉపయోగించడం వల్ల ఆందోళన తగ్గుతుంది. నిద్రలేమితో బాధపడేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. స్ట్రెస్ బాల్‌ను ఉపయోగించడానికి ప్రత్యేకమైన విధానం ఏమీ లేదు. మీకు సౌకర్యంగా అనిపించే విధంగా దాన్ని నొక్కుతుండండి. మీరు కూర్చున్నప్పుడు లేదా నిలబడి ఉన్నప్పుడు కూడా దీన్ని ఉపయోగించవచ్చు.
ఒత్తిడి అనిపించినప్పుడు, ఆందోళనగా ఉన్నప్పుడు, ఏకాగ్రత కోల్పోయినప్పుడు, కండరాల నొప్పి ఉన్నప్పుడు, నిద్ర సమస్యలు ఉన్నప్పుడు దీన్ని నొక్కుతుండండి.
స్ట్రెస్ బాల్ చికిత్స కాదు. ఇది ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడే ఒక సాధనం మాత్రమే అని తెలుసుకోండి.












Click it and Unblock the Notifications