డయాబెటిస్ ఉన్నవారు చక్కెర, బెల్లంలలో ఏది తినటం మంచిది?
ప్రస్తుతం చాలామందికి ఆరోగ్యంపైన విపరీతమైన కాన్షియస్ పెరుగుతుంది. ఈ క్రమంలో చాలామంది తినకూడని పదార్థాలను దూరం పెడుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ బాధితులు ఆహారపు అలవాట్లను మార్చుకునే క్రమంలో కొన్ని పదార్థాలకు దూరంగా ఉండాలని వైద్యులు సైతం చెప్తున్నారు. ముఖ్యంగా చక్కెరకు డయాబెటిస్ బాధితులు దూరంగా ఉంటున్న వేళ చక్కెరకు ప్రత్యామ్నాయంగా బెల్లం వాడవచ్చా.. చక్కెర బెల్లం లలో ఏది మంచిది అనే అంశాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
చక్కెరకు ప్రత్యామ్నాయంగా బెల్లాన్ని ఎందుకు వాడుతున్నాము?
చక్కెర ప్రాసెస్ చేయబడిన స్వీటెనర్.. బెల్లం సహజ సిద్ధమైన స్వీటెనర్.. అయితే చక్కెర, బెల్లం రెండు చెరుకునుండే తయారు చేస్తారు ఇవి రెండూ ఒకే రకమైన క్యాలరీలను కలిగి ఉంటాయి. అంతేకాదు ఇవి రెండూ ఒకే విధమైన ప్రభావాలను కూడా కలిగి ఉంటాయని వైద్యులు చెబుతారు. అలాంటప్పుడు చక్కెరకు ప్రత్యామ్నాయంగా బెల్లాన్ని ఎందుకు వాడుతున్నాము దానికి గల కారణం ఏమిటి అంటే

చక్కెర, బెల్లం తయారీ ఇలా.. పోషకాలు అందులోనే ఎక్కువ
చక్కెరను బెల్లాన్ని తయారు చేసే విధానంలో చాలా తేడా ఉంటుంది. చక్కెరను చిన్న చిన్న స్పటికాలుగా తయారు చేస్తారు అయితే బెల్లాన్ని మాత్రం పెద్ద ముక్కలుగా తయారు చేస్తారు. చక్కెర తయారీలో కొన్ని రకాల కెమికల్స్ ను వాడుతారు. దీనివల్ల అందులో ఉండే ప్రోటీన్లు, మినరల్స్ నశించిపోతాయి కానీ బెల్లాన్ని చెరుకు రసాన్ని మరిగించి తయారు చేస్తారు. దీనిని రిఫైన్ చేయరు కాబట్టి బెల్లంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
చక్కెర బెల్లం ఏదైనా ఒకటేనా
అందుకే ఇటీవల కాలంలో చాలామంది షుగర్ పేషెంట్లు చక్కెరకు బదులుగా బెల్లాన్ని తింటున్నారు. అయితే చక్కెర బెల్లం ఏదైనా సరే తిన్న వెంటనే శరీరంలోకి వెళ్లి గ్లూకోజ్ గా మారుతాయి. షుగర్ బాధితులు చక్కెర బదులు బెల్లాన్ని తినొచ్చని భావించి బెల్లాన్ని ఎక్కువగా తీసుకుంటే అది కూడా రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బెల్లంతో కాస్త తక్కువ ముప్పు
అయితే చక్కెరతో పోల్చి చూసినట్లయితే బెల్లం కాస్త నిదానంగా జీర్ణం అవుతుందని, రక్తంలోని షుగర్ స్థాయి కాస్త నిదానంగా పెరుగుతుందని చెబుతున్నారు. ఒకవేళ ఎవరైనా చక్కెర, బెల్లం రెండింటిలో ఏదైనా ఒకదాన్నే తీసుకోవాలి అనుకుంటే బెల్లాన్ని తీసుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు.
డయాబెటిస్ బాధితులు ఇది మానెయ్యండి
డయాబెటిస్ తో బాధపడుతున్న వారు ఈ రెండింటిని తినకుండా ఉంటే మంచిదని చెబుతున్నారు. జీవితంలో హెల్తీ డైట్ ను పాటించాలి అనుకునేవారు చక్కెరను మానేస్తే మంచిదని సూచిస్తున్నారు. తినే ఆహారంలో చక్కెరను తగ్గించుకోవడంతో పాటుగా చక్కెరతో తయారు చేసిన పదార్థాలు స్వీట్లు, చాక్లెట్లు, కూల్డ్రింక్స్ వంటి షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను కూడా దూరం పెట్టాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications