Benefits of Sunlight: రోజూ ఎండలో ఎంతసేపు ఉండాలి..?
మానవులకు విటమిన్ D ఎంతో అవసరం. సూర్యరశ్మి ద్వారా శరీరం దీన్ని ఉత్పత్తి చేస్తుంది. అలాగే కొన్ని ఆహారాలు, సప్లిమెంట్ల ద్వారా కూడా విటమిన్ D ను పొందొచ్చు. విటమిన్ D అనేది ఎముకలు, దంతాల దృఢత్వానికి అలాగే రోగనిరోధక శక్తిని పెంచి మెదడు ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన విటమిన్ గా ఉంటుంది. తగినంత విటమిన్ D లేకపోతే అలసట, కండరాల బలహీనత, ఎముకల నొప్పి, నిరాశ తదితర లక్షణాలు కనిపిస్తాయి.
అయితే విటమిన్ D కోసం రోజూ ఎంతసేపు ఎండలో ఉండాలి..? అనే ప్రశ్న చాలామందిలో ఉత్పన్నం అవుతుంది. అయితే శరీరానికి రోజుకు ఎంతసేపు ఎండ తగలాలి అనేది చర్మం రంగు, వయసు, ప్రాంతం.. ఇలా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా.. తెల్లటి చర్మం ఉన్నవారు రోజుకు 10-20 నిమిషాలు అలాగే నల్లటి చర్మం ఉన్నవారు 30-40 నిమిషాలు ఎండలో ఉండటం మంచిదని వైద్యులు చెబుతున్నారు.
ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 గంటల మధ్య ఎండలో నిలబడితే మన శరీరం విటమిన్ D ను ఉత్పత్తి చేస్తుందని వైద్యులు వివరిస్తున్నారు. ఓవైపు ఎండ ప్రభావం నుండి చర్మాన్ని కాపాడుకుంటూనే రోజూ శరీరానికి తగినంత ఎండ తగిలేలా చూసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. అలాగే ఎక్కువసేపు ఎండలో ఉండటం వల్ల కళ్లు తిరగడంతో పాటు చర్మంపై ఇతర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు వివరిస్తున్నారు.
ఇక విటమిన్ D ప్రయోజనాలను చూస్తే.. ఇది ఎముకల ఆరోగ్యానికి బాగా పనిచేస్తుంది. ఇది కాల్షియం, ఫాస్ఫేట్ లను శరీరం గ్రహించుకునేందుకు సాయపడుతుంది. దీనివల్ల ఎముకలు, దంతాలు బలంగా తయారవుతాయి. అలాగే రోగనిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి విటమిన్ D సాయపడుతుంది. అంతేకాక మెదడు ఆరోగ్యానికి కూడా ఇది అవసరం అని వైద్యులు చెబుతున్నారు. అలాగే విటమిన్ D మానసిక స్థితిని మెరుగుపరచడంలో సాయపడుతుందని వైద్యులు వివరిస్తున్నారు. అంతేకాక శరీరంలో మంటను నియంత్రించడంలో విటమిన్ D ముఖ్య పాత్ర పోషిస్తుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

విటమిన్ D లోపం కారణంగా ఎముకలు బలహీనపడటం, పగుళ్లు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు వివరిస్తున్నారు. అలాగే విటమిన్ D కారణంగా అలసట, కండరాల బలహీనత, ఎముకల నొప్పి, మానసిక స్థితిలో మార్పులు లాంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. విటమిన్ D లేకపోవడం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని వైద్యులు వివరిస్తున్నారు.












Click it and Unblock the Notifications