సూపర్ టేస్టీ బ్రేక్ ఫాస్ట్.. ఎగ్​ సలాడ్​.. ఈజీగా ఇలా చేసుకోండి..

గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. గుడ్డును ఏ విధంగా చేసుకున్నా టేస్టీగానే ఉంటుంది. ఫ్రై చేసుకున్నా.. పులుసు పెట్టుకున్నా లేదా ఆమ్లెట్ వేసుకున్నా ఎగ్ సూపర్ టేస్టీగానే ఉంటుంది. అయితే ఉదయం ఆఫీస్, స్కూల్స్ హడావుడిలో పెద్దలు , పిల్లలు తమకు ఇష్టమైన టిఫిన్ ను తనివితీరా ఆస్వాదించేందుకు సమయం దొరకదు. అయితే ఉదయం హడావుడిలో ఇలా ఈజీగా కేవలం 10 నిమిషాల్లోనే తయారు చేసుకునే విధంగా ఎగ్ సలాడ్ ఉంటుంది. చాలా తక్కువ పదార్థాలతో ఎక్కువ పోషకాలు నిండిన ఈ ఎగ్ సలాడ్ ను ఎలా తయారు చేయాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..?

ఎగ్ సలాడ్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. కోడి గుడ్లు నాలుగు, ఉల్లిపాయ పెద్దది ఒకటి, క్యారెట్ ఒకటి, టమాటో ఒకటి, క్యాప్సికం సగం, కీరా ఒకటి, చాట్ మసాలా కొద్దిగా, మిరియాల పొడి అర టీస్పూన్, ఉప్పు కొద్దిగా, కొత్తిమీర తరుగు కొద్దిగా తీసుకోవాలి.

ఎగ్ సలాడ్ తయారీ విధానం చూస్తే.. ముందుగా ఎగ్స్ ను ఓ గిన్నెలోకి తీసుకుని అందులో ఉప్పు వేసి ఉడికించుకోవాలి. గుడ్లు ఉడికేలోపు ఉల్లిపాయ ఒకటి సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే క్యారెట్ ను సన్నగా తురుముకోవాలి. అలాగే కీరాదోసను కూడా పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టామాటో, క్యాప్సికంను కట్ చేసుకోవాలి. ఇక గుడ్లు ఉడికాక వాటి పొట్టు తీసి పొడుగ్గా కట్ చేసుకోవాలి.

Super Tasty Egg Salad Breakfast Make It Easily at Home Like This

ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని ఎగ్ ముక్కలు అలాగే ఉల్లిపాయ తురుము, క్యారెట్, టమాటో, క్యాప్సికం ముక్కలు, మసాలా, ఉప్పు, మిరియాల పొడి అందులో వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చేతితో గానీ గరిటెతోగానీ బాగా కలుపుకోవాలి. చివరగా ఆ మిశ్రమంపై కొత్తిమీర తురుము వేసి సర్వ్ చేసుకోవడమే.. సూపర్ టేస్టీ అండ్ హెల్దీ ఎగ్ సలాడ్ రెడీ అయినట్టే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+