స్వీట్ కార్న్ చేసే మేలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!!
మొక్కజొన్నలు ఒకప్పుడు అతి కొద్దిరోజులే దొరికేవి. ఇప్పుడు మాత్రం సంవత్సరం పొడవునా లభిస్తున్నాయి. స్వీట్ కార్న్ ఏడాది మొత్తం దొరుకుతోంది. దీన్ని వంటల్లో కూడా ఉపయోగిస్తారు. వీటిని గింజలు వలిచి వేయించుకొని స్నాక్స్ రూపంలో కొందరు తీసుకుంటుంటారు. దీన్ని తరుచుగా మన ఆహారంలో భాగం చేసుకోవడంవల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం.
స్వీట్ కార్న్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాదు.. కొలెస్ట్రాల్ లెవల్స్ ను కూడా తగ్గిస్తాయి. ఇందులో క్యాలరీలు, ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటాయి. దీనివల్ల తిన్నవెంటనే మనకు కడుపు నిండిన భావన కలుగుతుంది. బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.

స్వీట్ కార్న్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. లుటీన్, జియాజాంతిన్ అనే సమ్మేళనాలుంటాయి. స్వీట్ కార్న్ ను తినడంవల్ల కళ్లకు మంచి ఆరోగ్యం. వయసు మీదపడటం వల్ల వచ్చే శుక్లాలు రాకుండా ఉంటాయి. కంటిచూపు కూడా మెరుగవుతుంది. సంక్లిష్టమైన కార్బొహైడ్రేట్లు ఉంటాయి. ఇవి మన శరీరానికి శక్తిని అందిస్తాయి. అంతేకాదు.. ముఖంపై ముడతలు రావు. ఎప్పుడూ యవ్వనంగా కనిపిస్తుంటారు. అనేక లాభాలను కలిగిస్తున్న స్వీట్ కార్న్ ను తినడం ఇప్పటినుంచే అలవాటు చేసుకోవాలి.
ఇందులో ఉండే బీటా కెరోటిన్ శరీరానికి అవసరమయ్యే విటమిన్ ఏ ను అందిస్తుంది. వ్యాధినిరోధకత పెరుగుతుంది. మధుమేహం ఉన్నవారు వివిధ రకాల ధాన్యాలతోపాటు మొక్కజొన్నను కూడా పరిమితంగానే తీసుకోవాలి. 100 గ్రాముల స్వీట్ కార్న్ లో 342 కేలరీలుంటాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచడానికి ఇది సహాయపడుతుంది.












Click it and Unblock the Notifications