Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

స్వీట్ కార్న్ తింటున్నారా? ఈ విషయం తెలుసుకోండి!

స్వీట్ కార్న్ (తీపి మొక్కజొన్న) తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కేవలం రుచికరమైన చిరుతిండి మాత్రమే కాదు, అనేక పోషకాలకు నిలయం. ఇందులో కార్బోహైడ్రేట్లు అధికం. ఇవి శరీరానికి తక్షణ, దీర్ఘకాలిక శక్తిని అందిస్తాయి. పీచు పదార్థం కూడా చాలా ఎక్కువ. ఇది జీర్ణక్రియకు చాలా సహాయపడుతుంది. కరిగే ఫైబర్, కరగని ఫైబర్ రెండూ ఉంటాయి. విటమిన్ సి, ఫోలేట్ (విటమిన్ B9), విటమిన్ B3 (నియాసిన్), విటమిన్ B5 (పాంటోథెనిక్ ఆమ్లం), విటమిన్ B6 ఉంటాయి. విటమిన్ B12 ఉంటుందికానీ చాలా తక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది.

మలబద్దకాన్ని నివారిస్తుంది
పొటాషియం, మాంగనీస్, ఫాస్పరస్, ఐరన్, జింక్, మెగ్నీషియం, కాపర్, సెలీనియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఇందులో ఉంటాయి. ఇవి శరీరంలోని అనేక జీవక్రియలకు అవసరం.లైకోపీన్, ల్యూటిన్, జియాక్సంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. స్వీట్ కార్న్‌లో ఉండే అధిక ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంతోపాటు మలబద్ధకాన్ని నివారిస్తుంది. అలాగే ప్రేగు కదలికలను క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది. కడుపు సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.

sweet corn health benefits and uses in telugu

కంటి శుక్లం నుంచి రక్షిస్తాయి
దీనిలో ఉండే కెరోటినాయిడ్లు, ముఖ్యంగా ల్యూటిన్, జియాక్సంతిన్, కంటి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. ఇవి రెటీనాకు హాని కలిగించే ప్రమాదకరమైన నీలి కాంతిని ఫిల్టర్ చేసి, కంటి వ్యాధులైన వయస్సు సంబంధిత మక్యులర్ డీజెనరేషన్, కంటిశుక్లం నుండి కళ్లను రక్షిస్తాయి. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల తక్కువ ఆహారంతోనే కడుపు నిండిన భావన కలుగుతుంది. కొవ్వు, కేలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి, బరువు తగ్గాలనుకునేవారి డైట్‌లో ఇది ఒక మంచి ఎంపిక.

ఎముకలను బలోపేతం చేస్తాయి
స్వీట్ కార్న్‌లో ఉండే విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని అందంగా, కాంతివంతంగా మార్చుతాయి. ఇవి చర్మంపై కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడి, చర్మం సాగే గుణానికి సహాయపడతాయి మరియు వృద్ధాప్య ఛాయలను ఆలస్యం చేస్తాయి. ఫాస్పరస్ ఎముకల ఆరోగ్యానికి చాలా సహాయపడుతుంది. పిల్లల్లో ఎముకల పెరుగుదలకు, మరియు వృద్ధుల్లో ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే మెగ్నీషియం కండరాలు, ఎముకలకు మంచిది. మధుమేహం ఉన్నవారు స్వీట్ కార్న్ తినవచ్చు, కానీ పరిమిత మోతాదులోనే తినాలి. ఇందులో కార్బోహైడ్రేట్లు, సహజ చక్కెర ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+