చిలగడదుంప తినడంవల్ల ఏమవుతుందో తెలుసా?

చిలగడదుంపలు తియ్యగా ఉంటాయి. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అందరూ వీటిని ఇష్టంగా తింటారు. శీతాకాలంలోనే ఎక్కువగా లభిస్తాయి. రుచికి రుచితోపాటు పోషక విలువలు కూడా ఉంటాయి. శీతాకాలంలో ఇవి తినడం చాలా మంచిది. ఆరోగ్యాన్ని ఏవిధంగా ప్రయోజనమో తెలుసుకుందాం.

చలికాలంలో చర్మం పొడిబారుతుంటుంది. దీనివల్ల అది పాడైపోతుంది. చిలగడదుంప తినడంవల్ల ముడతలు పడిన, వృద్ధాప్య ఛాయలుండే చర్మం సమస్యలను పరిష్కరిస్తుంది. ప్రీ రాడికల్స్ తో పోరాడి చర్మాన్ని కాపాడుతుంది. గరుకుగా కాకుండా మృదువుగా, తేమను కోల్పోకుండా చూస్తుంది.

sweet potato healt benefits and uses

చలి ఎక్కువగా ఉండటంతో ఎక్కువ మంది తొందరగా బయటకు రారు. అటువంటి సమయంలో మానసిక స్థితిని మెరుగుపరచడానికి, ఒత్తిడికి వ్యతిరేకంగా పోరాడే మెగ్నీషియం కంటెంట్ ఎక్కువగా ఉండే చిలగడదుంపను తీసుకోవడం ఎంతో మంచిది. ఇది వేడిని ఉత్పత్తి చేసే లక్షణాలను కలిగివుంటుంది. దీన్ని తీసుకోవడంవల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. సహజ చక్కెర కంటెంట్ తో చిలగడదుంప శరీరానికి వెంటనే తక్షణ శక్తిని అందిస్తుంది. రక్తపోటు స్థాయులు మెరుగుపడతాయి. పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉండటంతో గుండె ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మేలు జరుగుతుంది.

వీటిల్లో ఫైబర్ పుష్కలంగా దొరుకుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. బీటా కెరోటిన్, విటమిన్ సి అధికంగా ఉంటాయి. శరీరానికి అవసరమైన శక్తిని ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి. క్యాన్సర్ ను నయం చేయగలిగే శక్తిని కలిగివుంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+