Sugar intake: పిల్లలకు స్వీట్స్, డ్రింక్స్ ఇస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. దీర్ఘకాల వ్యాధులకు అదే ఫస్ట్ స్టెప్

Child health: ఆనందంగా ఉండే ప్రతి సందర్భంలోనూ చాక్లెట్లు, స్వీట్స్ తనిపించుకోవడం మనకు అలవాటు. అయితే చిన్న పిల్లల విషయంలో ఇలా చేయడం సరికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘ కాలంలో ఇది ఎంతో ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అప్రమత్తంగా వ్యవహరించకపోతే షుగర్ వ్యాధి బారిన పడాల్సి వస్తుందని జాగ్రత్త చెబుతున్నారు.

అధిక చక్కెర వినియోగం పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ విషయంలో కట్టడి చేయాలని సూచిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో షుగర్ కాండీలను ఇవ్వవద్దని సలహా ఇస్తున్నారు. తాజా పరిశోధన ప్రకారం శిశువుల తొలిరెండేళ్లలో చక్కెర వినియోగాన్ని కంట్రోల్ చేయడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధుల ముప్పును తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది.

Sweets and sugar intake causes big damage for children

అధ్యయనం ప్రకారం చిన్న వయసులో చక్కెర వినియోగం పరిమితిలో ఉంచుకోడం వల్ల టైప్ 2 మధుమేహం ప్రమాదాన్ని 35 శాతం తగ్గించవచ్చు. రక్తపోటు ప్రమాదం నుంచి 20 శాతం మేర తప్పించుకోవచ్చు. ఇండియాలో టైప్ 2 షుగర్ రోగుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలున్న నేపథ్యంలో ఈ చక్కెర వాడుక తగ్గింపు సూచన భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించడంలో తోడ్పడుతుంది.

శరీరంలో ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్ నిరోధకత, ఊబకాయం మరియు టైప్ 2 మధుమేహం వంటి సమస్యలకు అధిక చక్కెర వినియోగమే కారణంగా అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాకుంగా పిల్లల ప్రవర్తన, జ్ఞాపకశక్తి, మరియు ఏకాగ్రతపై కూడా ప్రతికూల ప్రభావం పడవచ్చు. దీన్ని తగ్గించుకోవడం వల్ల పిల్లల్లో ఆహార నియంత్రణ, శరీర బరువుతో పాటు దంత ఆరోగ్యం మరియు శక్తి స్థాయిలను మెరుగుపరచవచ్చు. స్వీట్ డ్రింక్స్ మరియు స్నాక్స్ కంట్రోల్ చేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు.

ఇక రెండేళ్లలోపు పిల్లలకు చక్కెరను పూర్తిగా దూరం పెట్టాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెద్ద పిల్లలు కూడా పరిమిత మోతాదులోనే వినియోగించాలని సిఫార్సు చేస్తున్నారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ 2-18 సంవత్సరాల పిల్లలు రోజుకు 25 గ్రాముల కంటే ఎక్కువ చక్కెర తీసుకోకూడదని సిఫార్సు చేస్తోంది. పండ్లు, పండ్ల రసాలు మరియు ఇంట్లోనే తక్కువ చక్కెరతో తయారుచేసిన ఆహార పదార్థాలు వంటి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాలంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+