ఎయిడ్స్ కన్నా డేంజర్‌గా వ్యాపిస్తున్న మరో సుఖ వ్యాధి
ఎయిడ్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. ఎయిడ్స్ వస్తే కొంతకాలం బాధను అనుభవించి ప్రాణాలు వదలడమే. ఈ వ్యాధికి ఇంతకుమించి ప్రత్యామ్నాయం లేదు. ఒక్కసారి వస్తే త్వరలోనే ప్రాణాలు పోతాయని మనిషిని మానసికంగా సిద్ధం చేయడం వంటిది. తాజాగా ఎయిడ్స్ కన్నా వేగంగా మరో వ్యాధి వ్యాపిస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనికోసం యాంటీ బయోటిక్ మందులు ఎన్ని వాడుతున్నా ఉపయోగం ఉండటంలేదు.. ఇవి పనిచేయడంలేదు. గనేరియా వ్యాధి కూడా ఇలాగే మారుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఐదురోజుల్లో బయటపడే వ్యాధి లక్షణాలు
వాస్తవానికి యాంటీ బయోటిక్స్ ఉపయోగించినప్పుడు బ్యాక్టీరియా తట్టుకొని నిలబడుతుంది. అయితే ఆ బ్యాక్టీరియా సూపర్ బగ్ గా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని నాశనం చేయడం కష్టంగా మారిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గనేరియా బారినపడి అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. సురక్షిత శృంగారం లేకపోవడంవల్ల, గనేరియా వ్యాధి ఉన్నవారితో జాగ్రత్తలు తీసుకోకుండా శృంగారంలో పాల్గొనడంవల్ల ఒకరి నుంచి మరొకరికి ఇది వేగంగా వ్యాపిస్తోంది. శృంగారంలో పాల్గొన్న రెండు నుంచి ఐదురోజుల్లోపు ఈ వ్యాధి లక్షణాలు బయటపడతాయి. మూత్ర మార్గం నుంచి చీము, మూత్ర విసర్జన నొప్పిగా ఉండటం, మంటగా ఉండటంతోపాటు మహిళల్లో తెల్లమైల కనిపిస్తుంది.

మూత్రం నిలిచిపోతోంది
అమెరికా వాసులకు గనేరియా ఎక్కువగా వస్తోంది. బాధితులు రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వెలిబుచ్చుతోంది. తీసుకోవాల్సిన చర్యలు, కట్టడికి జాగ్రత్తలపై అన్ని దేశాలను అప్రమత్తం చేస్తోంది. మహిళల్లో ఫెలోపియన్ ట్యూబులు మూసుకుపోవడం, పురుషుల్లో వ్యంధ్యత్వం, మూత్రం నిలిచిపోవడంలాంటి సమస్యలు వస్తున్నాయి. ఈ బ్యాక్టీరియా కళ్లు, గుండె, కీళ్ల భాగాలకు చేరితే అనేక సమస్యలు తలెత్తుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
అయితే దీనిపై చాలామందికి అవగాహన లేదు. ప్రతి ఏడాదికి కోట్ల మందికి ఇది వ్యాపిస్తోంది. ఇటీవలే భారతదేశంలోని హైదరాబాద్, సికింద్రాబాద్, ముంబయి, పూణె, ఢిల్లీ లాంటి నగరాల్లో గనేరియా రోగులపై పరిశోధన జరపగా వారిలో 124 మందికి మందులకు కూడా లొంగని బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. ప్రతి చిన్న విషయానికి యాంటీ బయోటిక్స్ ఎక్కువగా వాడటంవల్ల ఈ పరిస్థితి తలెత్తిందంటున్నారు.












Click it and Unblock the Notifications