శృంగారానికి ముందు... శృంగారం తర్వాత ఇలా చేయొద్దు!
శృంగారం అనేది అందరికీ అవసరమైన ఔషధం. శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా ఇది బాగుచేస్తుంది. కొందరికి ఎక్కువ ఆసక్తి ఉంటే మరికొందరికి తక్కువ ఆసక్తి ఉంటుంది. ఇటీవలే విడుదలైన ఒక అధ్యయనం ప్రకారం శృంగారానికి ముందు, తర్వాత ప్రతి ఒక్కరూ చేయకూడని పనులు ఉంటాయి. అవి చేయడంవల్ల వ్యక్తి మూడ్ డౌనవుతుంది. ప్రపంచంలో మనిషికి తిండి, నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం.
శృంగారానికి ముందు తాగితే మంచి మూడ్ వస్తుందని కొందరు చెబుతుంటారు. అయితే అందులో వాస్తవం లేదు. మద్యం సేవించడమన్నది ఎంతమాత్రం సరైంది కాదు. చాలా తక్కువగా తీసుకుంటే పర్వాలేదుకానీ ఎక్కువగా తీసుకుంటే ఎక్కువ తృప్తి కూడా ఇవ్వదని తేలింది. శృంగారం తర్వాత మనం చేసే చిన్న చిన్న తప్పులు గర్భం దాల్చడానికి కారణమవుతుంటాయి. స్త్రీ, పురుషుల కలయిక తర్వాత పొత్తి కడుపును పైకి ఎత్తకూడదు. అలా చేస్తే మహిళలు త్వరగా గర్భం దాల్చే అవకాశం ఉంది.

శృంగారానికి ముందు కొందరు స్నానం చేసేందుకు ఇష్టపడరని ఆ అధ్యయనంలో తేలింది. శృంగారం తర్వాత స్నానం చేద్దామనే ఆలోచనలో ఉంటారంట. భాగస్వామితో కలయికకు ముందే స్నానం చేస్తే మంచిది. ప్రధానంగా శృంగారంలో రకరకాల భంగిమలతో పాల్గొనేవారు తప్పనిసరిగా స్నానం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే జననాంగాల ద్వారా బ్యాక్టీరియా పలువురికి వ్యాపిస్తుంది. శృంగారం చేసే సమయంలో ముందుగానే తమకు ఏది నచ్చుతుంది, ఏది నచ్చదు అనే విషయాలను భాగస్వామితో పంచుకోవాలి. ఇష్టాయిష్టాలు ఇరువురూ తెలుసుకోవడంవల్ల శృంగారాన్ని ఆస్వాదిస్తారని అధ్యయనం వెల్లడించింది.












Click it and Unblock the Notifications