కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇవి తినండి
శరీరంలో కిడ్నీలు ముఖ్యమైన అవయవాలు. అవి ఆరోగ్యంగా ఉంటేనే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాయి. వాటికి ఎటువంటి సమస్య ఎదురైనా మన ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. శరీరం నుంచి విషతుల్యాలను బయటకు పంపిస్తాయి. రక్తాన్ని శుద్ధి చేసి శరీరానికి అవసరంలేనివాటిని మూత్రం రూపంలో బయటకు పంపుతుంది. అందుకే వీటిని ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలంటే కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. వాటి వివరాలు తెలుసుకుందాం.
యాపిల్:ఇందులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. గుండె జబ్బు, కొలెస్ట్రాల్ స్థాయి తగ్గడంతోపాటు మధుమేహ నియంత్రణకు తోడ్పడతాయి. మధుమేహం వల్ల కిడ్నీలకు ముప్పు ఎక్కువ. యాపిల్ తినడంవల్ల ఆ సమస్యను తగ్గించుకోవచ్చు.

వెల్లుల్లి:శరీరానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. కిడ్నీల నుంచి అనవసరమైన వ్యర్థాలను బయటకు పంపించేందుకు తోడ్పడుతుంది. పచ్చిగా తినొచ్చు.. లేదంటే వంటల్లో వేసుకొని తిన్నా మంచి ఫలితం దక్కుతుంది.
ఓట్స్:పీచు పదార్థాలు ఎక్కువ. ఓట్స్ వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం తగ్గుతుంది. ఉదయం తీసుకుంటే బాగుంటుంది. బీటా గ్లూకాన్ అనే నీటిలో కరిగే ఫైబర్ ఉంటుంది.
నీరు:ప్రతిరోజు క్రమం తప్పకుండా ఏడు నుంచి ఎనిమిది గ్లాసుల వరకు నీరు తీసుకోవాలి. శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా రక్షిస్తుంది. నీటిని ఎక్కువగా తాగడంవల్ల కిడ్నీలకు హాని చేసే విషతుల్యాలు శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి.
లావు మిర్చి:లావుగా ఉండే ఎర్రటి మిర్చిలో విటమిన్ ఏ, విటమిన్ సి ఉంటాయి. మార్కెట్ లో అరుదగా లభిస్తుంటాయి.
స్ట్రాబెర్రీలు:విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. మాంగనీస్, పొటాషియం కిడ్నీలు చక్కగా పనిచేసేందుకు తోడ్పడతాయి.
ఉల్లిపాయలు:బీపీని తగ్గించి మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. సోడియం తక్కువగా ఉంటుంది.
పుట్టగొడుగులు:ఇందులో విటమిన్ బి, విటమిన్ డి ఉంటాయి. ఇవి కడ్నీ జబ్బులను దూరం చేస్తాయి.
క్యాలిఫ్లవర్:విటమిన్ కే, విటమిన్ సి, ఒమెగా ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. సల్ఫర్, పొటాషియం శరీరంలోని టాక్సిన్లను పంపేస్తాయి. కిడ్నీల పనితీరు మెరుగవుతుంది.












Click it and Unblock the Notifications