ఇవి తీసుకోండి... గ్రద్ద లాంటి కంటి చూపు మీ సొంతమవుతుంది!
కంటిచూపు మెరుగుపడటానికి, కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా కొన్ని విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు కంటి ఆరోగ్యానికి అవసరం. కంటి చూపు మెరుగుపడటానికి పోషకాహారం తీసుకోవాలి.
విటమిన్ ఎ అధికంగా ఉండేవి:
కంటి ఆరోగ్యానికి విటమిన్ ఎ అత్యంత ముఖ్యమైనది. ఇది రాత్రి దృష్టిని మెరుగుపరచడంతోపాటు కళ్లు పొడిబారడాన్ని నివారిస్తుంది. క్యారెట్లు: బీటా-కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది, ఇది శరీరంలో విటమిన్ ఎ గా మారుతుంది.

చిలగడదుంపలు: క్యారెట్ల మాదిరిగానే వీటిలో కూడా బీటా-కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఆకుకూరలు: పాలకూర, కాలే, తోటకూర, బచ్చలికూర వంటి ముదురు ఆకుపచ్చ కూరగాయలు తీసుకోవాలి. విటమిన్ ఏ కు మంచి వనరైన గుమ్మడికాయను కూడా తీసుకుంటుండాలి. గుడ్డు పచ్చ సొన, మామిడి, బొప్పాయిల్లో కూడా బీటా కెరోటిన్ ఉంటుంది. ల్యూటిన్, జియాక్సంతిన్: ఈ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు కంటి రెటీనాలోని మక్యులా లో ఉంటాయి. ఇవి హానికరమైన నీలి కాంతిని ఫిల్టర్ చేసి, వయస్సు సంబంధిత మక్యులర్ డీజెనరేషన్, కంటిశుక్లం నుండి కంటిని రక్షిస్తాయి. ఆకుకూరలు: పాలకూర, కాలే, బచ్చలికూర తీసుకోవాలి.
విటమిన్ సి : ఇది ఒక యాంటీఆక్సిడెంట్, ఇది కంటి రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది, కంటిశుక్లం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. సిట్రస్ పండ్లు: నారింజ, నిమ్మ, బత్తాయి, ద్రాక్షపండ్లు తీసుకోవాలి. అలాగే ఉసిరికాయ, స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్బెర్రీలు తరుచుగా తీసుకోవాలి. విటమిన్ ఇ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది కంటి కణాలను ఆక్సీకరణ నష్టం నుండి రక్షించి, కంటిశుక్లం, AMD ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
నట్స్, బాదం, వాల్‌నట్‌లు, వేరుశెనగ, పొద్దుతిరుగుడు విత్తనాలు, అవిసె గింజలు తినాలి. కన్ను పొడిబారకుడా రెటీనా ఆరోగ్యాన్ని కాపాడటానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే సాల్మన్, ట్యూనా, సార్టినెస్, మాకెరల్ చేపలు, చియా గింజలు తీసుకోవాలి. గుమ్మడి గింజలు, జీడిపప్పు, గుడ్లు, మాసం, నేరేడు పండ్లు, కాకరకాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి.












Click it and Unblock the Notifications