కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి!

మానవ శరీరంలో ముఖ్యమైన అవయవాలు మూత్రపిండాలు. మూత్రపిండాలు సక్రమంగా పనిచేస్తేనే మన శరీరంలోని మిగతా అంగాల పనితీరు కూడా బాగుంటుంది. ప్రస్తుతం భారతదేశంలో మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. తొలిదశలో మూత్ర పిండాల గురించి పట్టించుకోక పోవటం ఇందుకు ఒక కారణంగా చెప్పొచ్చు.

కిడ్నీలను కాపాడుకోవటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ప్రస్తుతం రకరకాల మూత్రపిండాల సమస్యలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. అధిక రక్తపోటు, మధుమేహం, డెంగ్యూ, మలేరియా, హెచ్ఐవి పాజిటివ్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, మూత్రపిండాలలో రాళ్లు కొన్ని రకాల మందుల వల్ల కూడా కిడ్నీ సమస్యలు వస్తాయి .అయితే మనం మన కిడ్నీలను కాపాడుకోవాలంటే ఏం చేయాలి ? అనేది ప్రతి ఒక్కరు కచ్చితంగా తెలుసుకోవాలి . కిడ్నీలను కాపాడుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Take these precautions to keep your kidneys healthy

కిడ్నీల విషయంలో ఈ జాగ్రత్తలు అవసరం
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో ఉప్పు తక్కువ తీసుకోవాలి. మాంసాహారాన్ని ఎక్కువ తీసుకోకూడదు. కిడ్నీల ఆరోగ్యం కోసం ప్రతి రోజు కనీసం ఒక 30 నిమిషాల పాటు అయినా వ్యాయామం చేయాలి. మనం తినే ఆహారంలో కచ్చితంగా ఫైబర్ కంటెంట్ ఉండేలా చూసుకోవాలి. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఉంటే మానుకోవాలి.నొప్పులకు సంబంధించి చీటికిమాటికి టాబ్లెట్లు, అనవసరమైన స్టెరాయిడ్లు వాడకుండా ఉండాలి.

దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు నిర్లక్ష్యం చెయ్యొద్దు
ఇక మధుమేహంతో బాధపడేవారు, హైబీపీతో బాధపడుతున్న వారు, తరచూ పరీక్షలు చేసుకుంటూ వైద్యుల సలహాల మేరకు మందులు వాడాలి. రక్తహీనతతో బాధపడుతున్న వారు నీరసం, ఒళ్ళు నొప్పులు, ఆయాసం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు వైద్యుల సలహా మేరకు మూత్రపిండాల పనితీరును చెక్ చేయించుకుని అవసరమైతే మందులు వాడాలి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడేవారు పొరబాటున కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు.

కిడ్నీ సమస్యలు వస్తే ఆరోగ్యమే కాదు ఆర్ధికంగా నష్టం
ఇక మూత్రపిండాల సమస్యల వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులే కాకుండా ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా వస్తాయి. కిడ్నీ సమస్యలను గుర్తించడం లేట్ చేస్తే చికిత్సకు చాలా ఖర్చు చేయాల్సి కూడా వస్తుంది. అందుకే మూత్రపిండాల ఆరోగ్యం పైన ప్రతి ఒక్కరూ కచ్చితంగా దృష్టి పెట్టాలి. మూత్రపిండాలను కాపాడుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలను కచ్చితంగా తీసుకోవాలి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+