జిమ్ అవసరం లేదు, కఠినమైన డైట్ వద్దు.. దీంతో షాకయ్యేలా వెయిట్ లాస్!
ఊబకాయం.. ప్రస్తుతం సమాజంలో ఇది అతి పెద్ద సమస్య. ఊబకాయంతో బాధపడుతూ బరువు తగ్గడం కోసం చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బరువు తగ్గడం లేదని తెగ బాధ పడుతూ ఉంటారు. బరువు తగ్గడం కోసం జిమ్ లకు వెళుతూ ఉంటారు. కఠినమైన డైట్ లను చేస్తూ ఉంటారు. కానీ ఎటువంటి ఫలితము రాదు.
ఇంట్లోని పదార్ధాలతోనే మంచి ఆయుర్వేదిక్ మెడిసిన్
అయితే బరువు తగ్గాలని భావించే వారికి చాలా తక్కువ ఖర్చుతో, ఇంట్లోనే ఉండే పదార్థాలతో, బరువును తగ్గించుకోవడానికి ఒక మంచి ఆయుర్వేదిక్ మెడిసిన్ మనమే తయారు చేసుకోవచ్చని చెబుతున్నారు.నేచురల్ పద్ధతిలో మనం మన బరువు తగ్గడానికి ఉదయం లేవగానే పరగడుపున, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత, రాత్రి పడుకునే ముందు ఒక డిటాక్స్ డ్రింక్ ని తాగితే మంచిదని సలహా ఇస్తున్నారు. మరి అదేమిటో ప్రస్తుతం చూద్దాం.

ఈ పొడితో అద్భుతం
100గ్రాముల జీలకర్రను, 100గ్రాముల వాము, 100గ్రాముల మెంతులు, మూడు సమపాళ్లల్లో తీసుకుని లైట్ గా వేయించి, అందులో 25గ్రాముల యాలుకలు, 100గ్రాముల సోంపును కలిపి మిక్సీలో వేసి మెత్తని పొడిగా చేసి దానిని ఎయిర్ టైట్ బాటిల్లో పెట్టుకొని, ప్రతిరోజు ఉదయం పరగడుపున నీళ్లలో వేసి మరిగించి తాగితే, అలాగే మధ్యాహ్నం భోజనం తర్వాత, రాత్రి పడుకునే ముందు దీనిని తీసుకుంటే బరువు తగ్గే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
దీంతో బరువుకు చెక్, షుగర్ నియంత్రణ
ఈ పానీయం కడుపు ఉబ్బరాన్ని తగ్గించడమే కాకుండా జీర్ణ ప్రక్రియను అద్భుతంగా మెరుగుపరుస్తుందని, ఇది శరీరంలో మలినాలను బయటకు పంపడానికి ఎంతో బాగా దోహదం చేస్తుందని చెబుతున్నారు. ఇది మన శరీరంలో మెటబాలిక్ రేట్ ను పెంచుతుందని, దీంతో చాలా ప్రభావవంతంగా శరీరంలోని ఫ్యాట్ బర్న్ అవుతుందని చెబుతున్నారు. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుందని, బరువు తగ్గడానికి ఎంతగానో సహకరిస్తుందని చెబుతున్నారు.
ఈ పొడితో ఆరోగ్యం, నొప్పులు మాయం
ప్రతిరోజు ఈ పొడిని తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు తగ్గి, ఎముకలు బలోపేతం అవుతాయి. కంటి చూపు మెరుగు పడుతుంది. పళ్ళు, చిగుళ్ళు బలంగా ఆరోగ్యంగా మారుతాయి. జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది. మలబద్ధకం తగ్గుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. గుండె పనితీరు మెరుగుపడుతుంది. దీర్ఘకాలికంగా దగ్గుతో బాధపడుతున్న వారికి దగ్గు తగ్గుతుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
షుగర్ పేషెంట్లకు మతిమరపు! పరిశోధనలో తేలిన నగ్న సత్యాలు.. -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ???












Click it and Unblock the Notifications