చింత చిగురు పప్పు.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ మామూలుగా ఉండదు..!
సమ్మర్ లో చింత చిగురు దొరుకుతుంది. వేసవిలో చికెన్, మటన్ లాంటివి కాకుండా సులభంగా జీర్ణం అయ్యే వంటలను తినేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. అయితే సమ్మర్ లో చింత చిగురుతో పప్పు చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చింత చిగురు పప్పు రుచి మాటల్లో వర్ణించలేని విధంగా ఉంటుంది. ఇది చేసుకోవడం కూడా చాలా సులభం. మరి సూపర్ టేస్టీ చింత చిగురు పప్పు తయారీ విధానం ఇక్కడ చూడండి.. కావాల్సిన పదార్థాలు.. తయారీ విధానం..
చింత చిగురు పప్పు తయారీ కోసం కావాల్సిన పదార్థాలు చూస్తే కందిపప్పు ఒక కప్పు, చింత చిగురు అర కప్పు, పసుపు అర టీ స్పూన్, ఉప్పు, కారం రుచికి సరిపడా, పోపు దినుసులు ఒక టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, ఎండుమిర్చి రెండు లేదా మూడు, వెల్లుల్లి రేకులు రెండు టేబుల్ స్పూన్ లు, నూనె రెండు టేబుల్ స్పూన్ లు తీసుకోవాలి. ఇప్పుడు చింత చిగురు పప్పు తయారీ విధానం చూస్తే ముందుగా ఒక స్టవ్ ఆన్ చేసి కుక్కర్ లో కందిపప్పు, చింత చిగురు, పసుపు అలాగే తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న పప్పును పప్పు గుత్తితో మెత్తగా రుబ్బుకోవాలి.

ఆ తర్వాత వేరొక గిన్నె తీసుకోవాలి. అందులో నూనె పోసి వేడి చేయాలి. అందులో పోపు దినుసులు, ఇంగువ, వెల్లుల్లి రేకులు, ఎండు మిర్చి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు వేగిన పోపులో రుబ్బిన పప్పు, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. అలా మరో రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరగా ఆ మిశ్రమంలో కొత్తిమీర వేస్తే సరి.. సూపర్ టేస్టీ చింత చిగురు పప్పు రెడీ అయినట్టే.. వేడి వేడి అన్నంలోకి ఈ పప్పు సూపర్ టేస్టీగా ఉంటుంది.












Click it and Unblock the Notifications