ఓరల్, మాక్సిలోఫేషియల్ సర్జన్ల పరిధిపై తెలంగాణ డెంటల్ కౌన్సిల్ స్పష్టత

Telangana Dental Council: ఓరల్, మాక్సిలోఫేషియల్ సర్జన్‌ల (OMFS) వృత్తి పరిధికి సంబంధించి ప్రజలకు తెలంగాణ డెంటల్ కౌన్సిల్ అవగాహన కల్పిస్తోంది. ఫేషియల్ సౌందర్య ప్రక్రియలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయటానికి ఓరల్,మాక్సిలోఫేషియల్ సర్జన్‌లకు అర్హత ఉంటుందని కౌన్సిల్ స్పష్టం చేస్తోంది. మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (ఎండీఎస్) కోర్సు రెగ్యులేషన్స్ (3వ సవరణ)కు డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (DCI) చేసిన సవరణల ఆధారంగా తెలంగాణ డెంటల్ కౌన్సిల్ ఈ విషయాన్ని ధ్రువీకరిస్తోంది. డీసీఐ చేసిన సవరణలను నోటిఫికేషన్ నం. DE-87(3)-2019 ద్వారా 2019 ఆగస్టు 26 న భారతదేశ గెజిట్‌లో ప్రచురించడం జరిగింది.

డీసీఐ నిబంధనల ప్రకారం, ఓరల్-మాక్సిలోఫేషియల్ సర్జన్లు అనేక రకాలైన ప్రక్రియలను నిర్వహించడానికి శిక్షణ పొందుతారు.
వీటిలో:
-మైనర్ ఓరల్ సర్జరీలు.
-సాఫ్ట్ టిష్యూ గాయాలు, పగుళ్లు, తుపాకీ గాయాలు, యుద్ధ గాయాలు, తల, మెడ ప్రాంతంలోని క్యాన్సర్‌లకు చేసే శస్త్రచికిత్సలు.
-క్రానియోఫేషియల్ సర్జరీ.
-దవడలు, ముఖంలో సౌందర్య లోపాలను శస్త్రచికిత్స ద్వారా సరిచేయడం.
-చర్మపు గ్రాఫ్ట్ హార్వెస్టింగ్.
-నడుం, పక్కటెముక, పుర్రె, దిగువ కాలు ఎముక గ్రాఫ్ట్ హార్వెస్టింగ్ సర్జరీలు.
-దవడ కీలు సర్జరీ.
-ముక్కు రూపాన్ని, లోపాలను సరిచేసే సర్జరీలు.
-పుర్రె బేస్ సర్జరీలు: కొవిడ్19 మహమ్మారి వ్యాపించిన సమయంలో బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్మైకోసిస్) ఇన్ఫెక్షన్లను తొలగించి ప్రాణాలను రక్షించడంలో మాక్సిలోఫేషియల్ సర్జన్లు కీలక పాత్ర పోషించారు.
-మాక్సిలోఫేషియల్ ప్రాంతంలో న్యూరాలజికల్ సమస్యలు.
-ట్రాకియోస్టోమీలు నిర్వహించడం.
-గాయాల లేజర్ సర్జరీ, క్రయోసర్జరీ.
-సౌందర్య ముఖ శస్త్రచికిత్స : ముఖ చర్మం, అంతర్లీన ముఖ కండరాలు, ఎముక, కనురెప్పలు, బాహ్య చెవికి సంబంధించిన చికిత్సలు. మొటిమల మచ్చలు, ఫేస్‌లిఫ్ట్, బ్లెఫారోప్లాస్టీ, ఓటోప్లాస్టీ, ఫేషియల్ బోన్ రీకాంటౌరింగ్ మొదలైన వాటికి చేసే శస్త్రచికిత్సలు.

Telangana Dental Council Clarifies OMFS Scope Eligibility for Facial Aesthetic Procedures and Hair Transplantation

అలాగే సౌందర్య, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రక్రియల కోసం ఓఎంఎఫ్ఎస్ నిపుణుల అర్హతను ధృవీకరిస్తూ డీసీఐ కూడా పలు నోటిఫికేషన్లు జారీ చేసింది. అర్హత కలిగిన ఓరల్, మాక్సిలోఫేషియల్ సర్జన్లు క్రానియోమాక్సిలోఫేషియల్ ప్రాంతంలో సౌందర్య శస్త్రచికిత్సా విధానాలను నిర్వహించగలరని ధృవీకరించింది."హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్"ను ఎండీఎస్-ఓరల్ మాక్సిలోఫేషియల్ సర్జరీ పాఠ్యాంశాలలో భాగంగా చేర్చాలని బెంగళూరులోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కు సూచించింది. ఓఎంఎఫ్ఎస్ ప్రాక్టీషనర్లు సౌందర్య, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రక్రియలను చేపట్టడానికి మార్గదర్శకాలను జారీ చేసింది. వారి అర్హతలు, సామర్థ్యాలను పునరుద్ఘాటించింది.

ఈ నేపథ్యంలో డీసీఐ ప్రమాణాల ప్రకారం శిక్షణ పొందిన, సరిగ్గా నమోదు చేసుకున్న ఓరల్, మాక్సిలోఫేషియల్ సర్జన్లు ముఖ సౌందర్య ప్రక్రియలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను నిర్వహించడానికి పూర్తిగా అర్హులని తెలంగాణ డెంటల్ కౌన్సిల్ ధ్రువీకరిస్తుంది. ఈ విషయానికి సంబంధించి డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేదా సంబంధిత రాష్ట్ర డెంటల్ కౌన్సిల్స్ మినహా మరే ఇతర సంస్థలు, కౌన్సిల్‌లు లేదా సంస్థల నుండి వచ్చే ప్రకటనలు చూసి ప్రజలు తప్పుదోవ పట్టవద్దని తెలంగాణ డెంటల్ కౌన్సిల్ సూచిస్తోంది.

తెలంగాణ డెంటల్ కౌన్సిల్ గురించి:
తెలంగాణ డెంటల్ కౌన్సిల్ అనేది డెంటిస్ట్స్ చట్టం, 1948 ప్రకారం స్థాపించబడిన ఒక చట్టబద్ధమైన అథారిటీ. తెలంగాణ రాష్ట్రంలో దంత వైద్య నిపుణుల నియంత్రణకు ఇది బాధ్యత వహిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+