క్యాలీఫ్లవర్ తో ఆరోగ్య ప్రయోజనాలు కోకొల్లలు, తెలిస్తే వదిలిపెట్టరు!

నిజ జీవితంలో మనం తినే ఆకుకూరలు, కూరగాయలు మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. అలా ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే వాటిలో క్యాలీఫ్లవర్ కూడా ఒకటి. ముఖ్యంగా ఈ శీతాకాలంలో వచ్చే క్యాలీఫ్లవర్ మన శరీరానికి కావలసిన బోలెడన్ని పోషకాలను ఇస్తుంది. మరి క్యాలీఫ్లవర్ తింటే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

క్యాలీఫ్లవర్ లో ఫుల్ పోషకాలు
క్యాలీఫ్లవర్ లో విటమిన్ సి, విటమిన్ బీ6, విటమిన్ కే, ఫోలేట్, పొటాషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, ఫైబర్ తో పాటు మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉంటాయి. క్యాలీఫ్లవర్ ను ప్రతిరోజు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. క్యాలీఫ్లవర్ లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఇవి మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి.

The health benefits of cauliflower are endless

క్యాలీఫ్లవర్ తో బీపీకి చెక్
క్యాలీఫ్లవర్ లో ఉండే ఆరోగ్యకరమైన మూలకాలు రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. ఫలితంగా మన గుండె ఆరోగ్యానికి కూడా మంచి జరుగుతుంది. బీపీ కంట్రోల్ లోకి వస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గడం వల్ల బరువు కూడా అదుపులోకి వస్తుంది. క్యాలీఫ్లవర్ మన జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది.

క్యాలీఫ్లవర్ తో టాక్సిన్స్ బయటకు
క్యాలీఫ్లవర్ లో ఉండే ఫైబర్ మన జీర్ణ ప్రక్రియ సాఫీగా జరగడానికి దోహదం చేస్తుంది. మన శరీరంలోని టాక్సిన్స్ సులభంగా బయటకు పంపడానికి క్యాలీఫ్లవర్ దోహదం చేస్తుంది. క్యాలీఫ్లవర్ లో ఉండే సల్ఫర్ నైట్రేట్లు, యాంటీ ఆక్సిడేట్లు, గ్లూకోసినోలేట్స్ మన శరీరంలో అన్ని టాక్సిన్స్ ను బయటకు పంపడంలో కీలకంగా పనిచేస్తాయి. సూర్యుని నుండి వచ్చే అతినీలలోహిత కిరణాల నుండి క్యాలీఫ్లవర్ మన చర్మాన్ని రక్షిస్తుంది.

క్యాలీఫ్లవర్ తో బరువుకు చెక్
క్యాలీఫ్లవర్ లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అందుకే బరువు తగ్గాలని భావించేవారు కాలిఫ్లవర్ ను డైట్ లో భాగంగా చేసుకుంటే మంచిది. అంతేకాదు క్యాలీఫ్లవర్ లో కోలిన్ ఉంటుంది. ఇది మన శరీరంలోని వ్యాధికారకాల పైన పోరాడడానికి తోడ్పడుతుంది. మన అవయవాల పనితీరును మెరుగుపరచడానికి దోహదం చేస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను ఇచ్చే క్యాలీఫ్లవర్ ను మన ఆహారంలో భాగంగా చేసుకోవడం ఎంతో మంచిది. క్రమం తప్పకుండా తింటే మంచి ప్రయోజనం ఉంటుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+