ఈ ఆహారాలతో ఈజీగా బరువు తగ్గుతారు.. ట్రై చెయ్యండి!
చాలామంది బరువు తగ్గడానికి విపరీతంగా కృషి చేస్తూ ఉంటారు. డైట్ కంట్రోల్, వ్యాయామం వంటివి చేసి కాస్త బరువు తగ్గుతారు. ఇక బరువు తగ్గినట్టే తగ్గి బరువు పెరుగుతూ ఉంటారు. దీంతో బరువు విషయంలో తీవ్ర అసహనానికి గురవుతూ ఉంటారు. అయితే బరువు తగ్గాలని భావించేవారు ఆహారం విషయంలో ఎప్పటికీ కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు. తగ్గిన బరువును అదేవిధంగా మెయింటైన్ చేయడానికి కూడా వీలవుతుంది.
ఈ ఆహారాలతో బరువు తగ్గుతారు
ముఖ్యంగా ఆహారం విషయంలో ఏమి తినాలి.. ఏమి తినకూడదు అనేది కచ్చితంగా తెలుసుకోవాలి. బరువు తగ్గాలని భావించేవారు ముఖ్యంగా ఆహారంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకునేలా చూడాలి. ఆకుకూరలు, కొన్ని రకాల కూరగాయలు బరువు తగ్గడానికి బాగా దోహదం చేస్తాయి. పాలకూర, బచ్చలి కూర, చుక్క కూర వంటి ఆకుకూరలే కాకుండా, సొరకాయ, బీరకాయ, చిక్కుళ్ళు వంటి కూరగాయలు బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి.

బరువును కంట్రోల్ చేసే ఆహారాలు ఇవే
ఆహారంలో ఓట్స్ ను భాగంగా చేసుకుంటే కూడా బరువు తగ్గుతారు. గుడ్లలో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుడ్లు మంచి ప్రోటీన్ ఆహారం. గుడ్లను మన ఆహారంలో భాగం చేసుకుంటే బరువు తగ్గొచ్చు. ఇవి మాత్రమే కాకుండా ప్రతిరోజు చియా సీడ్స్ నానబెట్టుకొని ఆ నీటిని తాగడం వల్ల కూడా బరువు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. తృణధాన్యాలు ఆహారంగా తీసుకోవడం కూడా బరువును కంట్రోల్ చేస్తుంది.
ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తింటే బరువుకు చెక్
డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకోవడం కూడా ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మాత్రమే కాకుండా, సమతుల ఆహారాన్ని తీసుకోవడం, ముఖ్యంగా ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల బరువు ఈజీగా తగ్గుతారు. ఇక అవకాడో, బెర్రీలు వంటివి ఆహారంలో భాగంగా చేసుకోవడం కూడా మన బరువు తగ్గడానికి ఎంతగానో దోహదం చేస్తాయి.
ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం
అయితే బరువు తగ్గాలని భావించేవారు ఎప్పటికీ ప్రోటీన్ ఉండే ఆహారాలనే ఎక్కువ తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న ఆహారాలు తీసుకుంటే బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. కనుక ఆహారం విషయంలో జాగ్రత్త బరువు విషయంలో కీలకంగా పని చేస్తుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications