బ్యాడ్ కొలెస్ట్రాల్ డేంజర్ బెల్స్ మోగిస్తుందని చెప్పే ప్రమాదకర లక్షణాలివే!

చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవన శైలి కారణంగా మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తయారవుతుంది. రక్తనాళాలలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్ ను పట్టించుకోకపోతే బ్లాకేజ్ ముప్పు పెరుగుతుంది. మన గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది.

కొలెస్ట్రాల్ ప్రమాదకర లక్షణాలు
మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఏ మేరకు ఉంది తెలుసుకోవడానికి కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నవారిలో కొన్ని ప్రమాదకర లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలను గమనించినట్లయితే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నదని నమ్మి కచ్చితంగా వైద్యున్ని సంప్రదించాల్సిందే. ఇక ఆ లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం.

These are the dangerous symptoms that indicate bad cholesterol levels are high Beware

కొలెస్ట్రాల్ ఎలా ఉంది ఇలా తెలుసుకోవాలి
సహజంగా కొలెస్ట్రాల్ గురించి తెలుసుకోవాలని భావించేవారు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలి. 45 సంవత్సరాల వయసు వచ్చేవరకు ప్రతి ఐదేళ్లకోసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఇక ఆ తర్వాత 45 ఏళ్లు దాటాక ప్రతి రెండేళ్లకు వైద్య పరీక్షలు చేయించుకోవాలి. లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోవాలి. ఇక ఈ పరీక్షలు ఏమీ లేకుండానే కొలెస్ట్రాల్ గురించి తెలిపే కొన్ని సంకేతాలు మన శరీరంపైన కూడా కనిపిస్తాయి.

కళ్ళపై మచ్చలు ఉన్నాయా?
కళ్ళపై పసుపు రంగు మచ్చలు వస్తే శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ అధికంగా ఉన్నట్టు అర్థం. కంటి రెప్ప పై భాగంలో కానీ కింది భాగంలో కానీ పసుపు రంగులో కొవ్వు పేరుకుని మచ్చ కనిపిస్తుంది. ఇక రెండవది కాళ్లలో నొప్పులు కనిపిస్తాయి. తరచూ అదేపనిగా కాలి మడమల్లో తీవ్రమైన నొప్పి కలుగుతుంటే కొలెస్ట్రాల్ అధికంగా ఉందనే అర్థం. అయితే ఈ నొప్పి కాసేపు విశ్రాంతి తీసుకుంటే తగ్గుతుంది. మళ్ళీ వస్తుంది.

కొలెస్ట్రాల్ ఉన్నవారిలో ఈ ప్రమాదకర సంకేతాలు
ఇక కొలెస్ట్రాల్ విపరీతంగా ఉన్న వారిలో కొంతమంది నడిచేటప్పుడు బ్యాలెన్స్ కోల్పోతారు. తడబడుతున్నట్లుగా నడుస్తారు. ఈ పరిస్థితినీ తేలికగా తీసుకోకూడదని ఇది చాలా ప్రమాదకరమని అంటున్నారు వైద్య నిపుణులు. ఇక కొంతమందిలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే చర్మం పైన పొక్కులు రావడం, దద్దుర్లు వంటివి రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇవి కీళ్లు, మోకాళ్లు మరియు జాయింట్లలో కనిపిస్తాయి.

ఛాతీలో ఇలా ఉంటుందా ? కళ్ళలో తెల్లని చారలు వస్తున్నాయా?
కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారిలో ఛాతిలో నొప్పి విపరీతంగా వస్తుంది. ఒకవేళ అలా వస్తే గుండె సంబంధిత సమస్యగా భావించి వైద్యులను సంప్రదించాలి. ఇంకా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారిలో కనిపించే మరో ప్రమాదకరమైన లక్షణం కళ్ళల్లో తెల్లని చారలు రావడం.. కంటి చుట్టూ లేదా కంట్లో తెలుపు చారలు కనిపిస్తే అది మన శరీరంలోని కొలెస్ట్రాల్ కు అద్దం పడుతుంది.

బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందని చెప్పే లక్షణాలివే.. జాగ్రత్త
ఈ లక్షణాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే ఈ పరిస్థితి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే బ్యాడ్ కొలెస్ట్రాల్ విషయంలో ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటూ కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేసే లాగా మెడిసిన్స్ తీసుకోవడంతో పాటు జీవన శైలిని మార్చుకోవాలి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+