చేపలతో పాటు కలిపి తినకూడని ఆహార పదార్ధాలు ఇవే!

చాలామంది చేపల కూరను చాలా ఇష్టంగా తింటారు. చేపలలో ఉండే పోషకాలు మనకు ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయని నమ్ముతారు. అయితే చేపల కూర తినాలి అనుకునేవారు చేపలతో కలిసి తినకూడని ఆహార పదార్థాలను గురించి తప్పకుండా తెలుసుకోవాలి. కొన్ని ఆహార పదార్థాలు చేపలకు విరుద్ధ ఆహారం కాబట్టి వాటిని తింటే అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

చేపల కూర తిని ఇవి తినొద్దు
మరి చేపల కూరతో కలిపి తినకూడని ఆహార పదార్థాలు ఏమిటి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. చేపలు తిన్నప్పుడు ఐస్ క్రీమ్ తినకూడదు. చేపలు తిన్న తర్వాత ఐస్ క్రీమ్ తింటే మన జీర్ణ వ్యవస్థ పైన ప్రభావం పడుతుంది. అంతే కాదు మన శరీరం పైన అలర్జీలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.

These are the foods that should not be eaten together with fish

చేపలు తిన్నాక ఇవి తాగినా ఇబ్బందే
చేపలు తిన్న తర్వాత పాలు పొరపాటున కూడా తాగకూడదు. చేపలు తిన్న తర్వాత పాలు తాగితే జీర్ణ సంబంధమైన సమస్యలు వస్తాయి. ఇక శరీరం పైన కూడా అలర్జీ వచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. అప్పటికే స్కిన్ అలర్జీలతో బాధపడేవారికి ఆ అలర్జీలు మరింత పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది.

చేపలు తిని ఇది తింటే జీర్ణ సమస్యలు
ఇక చేపల కూర తిన్న తర్వాత పెరుగును పొరపాటున కూడా తినకూడదు కొంతమంది చేపల కూర తిన్న తర్వాత పెరుగును తింటూ ఉంటారు ఇది ఏమాత్రం మంచిది కాదు దీని వల్ల కూడా జీర్ణ సంబంధమైన సమస్యలు వచ్చి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఒక్కోసారి చేపలు తిన్న తర్వాత పెరుగు తినడం వల్ల స్కిన్ అలర్జీలు కూడా ఎక్కువవుతాయి.

చేపలు తిన్నాక ఈ పండ్లు తినొద్దు
ఇక చేపల తిన కూర తినడాన్ని ఇష్టపడేవారు చేపలు తిన్న తర్వాత సిట్రస్ పండ్లను తినకూడదు . బత్తాయి, నారింజ, కమలా వంటి పండ్లను చేపలు తిన్న తర్వాత తింటే దాని ప్రభావం మన జీర్ణవ్యవస్థ పైన కచ్చితంగా పడుతుంది. ఇది కూడా స్కిన్ అలర్జీలు రావడానికి కారణం అవుతుంది.

చేపలు తినేటప్పుడు జాగ్రత్త
ముఖ్యంగా మిల్క్ ప్రొడక్ట్స్ ను చేపలు తిన్న తర్వాత తింటే అది మన కడుపు ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. కనుక చేపలు తిన్న తర్వాత ఈ ఆహార పదార్థాలను పొరపాటున కూడా తినకూడదు . అంతేకాదు చేపలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని దానిని కూడా మితం లేకుండా తినకూడదు. ముఖ్యంగా చేపలు స్కిన్ అలర్జీలకు, జీర్ణాశయ సమస్యలకు కారణం అవుతాయి. కనుక చేపలు తినేటప్పుడు తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+