వేసవిలో శక్తినిచ్చే సూపర్ ఫుడ్స్ ఇవే!

చాలామంది వేసవికాలంలో ఎండ దెబ్బకు శరీరం డిహైడ్రేట్ అయ్యి శక్తిని కోల్పోయి నీరసంగా ఫీల్ అవుతూ ఉంటారు. అటువంటివారు సమ్మర్లో రోజంతా చురుకుగా ఉండడానికి శక్తినిచ్చే ఆరు రకాల సూపర్ ఫుడ్స్ ను తింటే మంచిదని డైటీషియన్లు చెప్తున్నారు. ఇక ఆ సూపర్ ఫుడ్స్ ఏంటి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

అరటి పండ్లు
అరటి పండ్లు మంచి పోషకాలతో కూడుకున్న ఆహారం. అరటి పండ్లలో పొటాషియం, కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి కావలసిన శీఘ్ర శక్తిని అందిస్తాయి. వీటిని ప్రీ వర్కవుట్ ఫుడ్ గా కూడా తీసుకోవచ్చు.

These are the super foods that give energy in summer season

గ్రీన్ టీ
గ్రీన్ టీ కూడా మనకు శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుంది. గ్రీన్ టీ తాగితే ఇది మన శరీరంలో అలసటను తగ్గించి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. వ్యాయామం చేసేటప్పుడు శక్తి స్థాయిలను కూడా ఇది పెంపొందిస్తుంది. కనుక ఈ సీజన్ లో గ్రీన్ టీ తాగడం ఎంతో మంచిది.

పాలకూర
పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఎవరైతే తక్కువ ఐరన్ స్థాయిలు కలిగి ఉంటారో వారు శక్తి హీనులుగా ఉంటారు. ఇక శక్తి వంతులుగా ఉండాలంటే కచ్చితంగా ఆహారంలో పాలకూరని భాగంగా చేసుకోవడం సూచించదగింది.

చియా సీడ్స్
చియా సీడ్స్ ను కూడా మనం ఒక సూపర్ ఫుడ్ గా చెప్పుకోవాలి. చియా సీడ్స్ ను నానబెట్టి తీసుకోవడం వల్ల శక్తి వస్తుంది. ఇందులో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ మన శరీరానికి కావాల్సిన ఎనర్జీని ఇచ్చి ఎంతగానో దోహదం చేస్తాయి.

డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్ చిన్న ముక్కను ప్రతిరోజు తింటే మన శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్లను శరీరానికి అందిస్తుంది. అలసటను తగ్గించి శక్తిని పెంచుతుంది. దృష్టిని కూడా మెరుగుపరుస్తుంది.

These are the super foods that give energy in summer season

ఓట్స్
ఓట్స్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఓట్స్ తిన్న తర్వాత మన శరీరంలో శక్తి పెరుగుతుంది. ఇక ఎండాకాలంలో అలసటతో బాధపడేవారు, శక్తి తక్కువగా ఉందని ఇబ్బంది పడేవారు, మీ ఆహారంలో ఓట్స్ తీసుకుంటే మంచిది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+