చలికాలంలో శరీర వెచ్చదనాన్ని పెంచే సూపర్ ఫుడ్స్

చలికాలంలో శరీరం వేడిని కోల్పోయి చల్లగా మారుతుంది. ఇది శరీరంపై విపరీతమైన ప్రభావం చూపుతుంది. చల్లటి వాతావరణం శరీరాన్ని గట్టిపడేలా చేస్తుంది. ఇలాంటి సమయంలో వెచ్చదనాన్ని ఇవ్వగల ఆహారాలు తీసుకోవడం చాలా అవసరం. ఇలాంటి ఆహారాలు శరీరానికి తక్షణ శక్తిని, పోషణను అందించడమే కాకుండా, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వేడి వేడిగా ఉండే ఆహారాలు శక్తిని పెంచి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. చలికాలంలో తినవలసిన కొన్ని ముఖ్యమైన ఆహారాలు ఇవి:

1. డ్రై ఫ్రూట్స్ - నట్స్
అల్మండ్, వాల్‌నట్, ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్ మంచి ప్రోటీన్లు మరియు ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలను అందిస్తాయి. ఇవి శరీరానికి వేడి మరియు శక్తిని అందిస్తాయి. ఉదయం పూట ఉష్ణాన్ని కల్పించేందుకు డ్రై ఫ్రూట్స్ తినడం మంచిది.

These are the super foods that increase body warmth in winters

2. తృణధాన్యాలు
జొన్న, రాగులు, మొక్కజొన్న వంటి తృణధాన్యాలు ఫైబర్‌తో నిండి ఉంటాయి. ఇవి శరీరానికి ఎక్కువ శక్తిని ఇస్తాయి. వీటితో చేసిన గంజి, రోటీలు, దోసలు చలికాలంలో వెచ్చగా ఉంచుతాయి. రాగి జావ , జొన్న రొట్టెలు చలికాలంలో అత్యుత్తమమైన ఆహారాలు. ఇవి శక్తిని ఇచ్చే పిండి పదార్థాలు, శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి.

3. గుడ్లు, చికెన్
గుడ్లు, చికెన్, లేదా మటన్ వంటి ప్రోటీన్ పుష్కలం. ఆరోగ్యకరమైన కొవ్వుల వనరుగా ఉన్నాయి. రోజూ గుడ్లు తీసుకోవడం శరీరంలో వేడిని పెంచడంలో సహాయపడుతుంది. వీటిలో ఉండే విటమిన్ డి చలి కాలంలో శక్తిని పెంచుతుంది. ఈ ఆహారాలు శరీరాన్ని వేడిగా ఉంచడంలో సహాయపడతాయి. వీటిలో ఉన్న ప్రోటీన్ , కొవ్వులు శక్తిని అందిస్తాయి.

4. అల్లం టీ, పసుపు పాలు
అల్లం టీతో కలిపి తీసుకోవడం వల్ల చలిని తగ్గించడంలో సహాయపడుతుంది. అల్లంలో ఉండే యాంటీఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి, శరీర వేడిని కలిగిస్తాయి. చలి కాలంలో పసుపు పాలు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. పసుపులో ఉండే కర్క్యూమిన్ శరీర వేడిని పెంచడమే కాకుండా, శరీరంలో వాపు, నొప్పి తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

These are the super foods that increase body warmth in winters

5 సూప్స్
గోరువెచ్చని కూరగాయల సూప్స్ లేదా చికెన్ సూప్స్ చలిలో వేడి పుట్టించడంలో సహాయపడతాయి. వీటిలో పోషకాలు అధికంగా ఉంటాయి. చల్లటి వాతావరణంలో మిరియాలు, మిర్చి, దాల్చిన చెక్క వంటి మసాలా పదార్థాలు ఆహారంలో కలిపితే శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది. ముఖ్యంగా మిరియాలు జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి. ఇవి జలుబు, దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తాయి.

6. తేనె, నెయ్యి
తేనెను గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే చలికి మంచిది. తేనె శరీర వేడిని పెంచి, చలికాలంలో వైరస్‌ల బారినపడకుండా రక్షిస్తుంది. గోరువెచ్చని అన్నంలో నెయ్యి కలిపి తింటే శరీర వేడి పెరుగుతుంది. ఇది చలి కాలంలో శక్తి అవసరాన్ని తీర్చడంలో ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

7 కూరగాయలు
పాలకూర, ముల్లంగి, గాజర్ వంటి కూరగాయలు తినడం ద్వారా మంచి విటమిన్లు మరియు న్యూట్రియంట్లు అందుతాయి. ఇవి శరీర వేడిని తగినంతగా ఉత్పత్తి చేస్తాయి.

చలికాలంలో వెచ్చని దుస్తులు ధరించడం చాలా ముఖ్యం. రోజూ వెచ్చని నీరు తాగడం వల్ల శరీరం లోపల నుండి వెచ్చగా ఉంటుంది. వ్యాయామం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. వేడి నీటితో స్నానం చేయడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి సరైన ఆహారం అవసరం. పై ఆహారాలను చలికాలంలో మితంగా తీసుకుంటే శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. చల్లటి వాతావరణం ప్రభావం నుంచి రక్షణ పొందవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+