లివర్ ఆరోగ్యాన్ని కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే!

ఆరోగ్యమే మహా భాగ్యం అంటారు. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చెయ్యగలిగేది. అటువంటి ఆరోగ్యం పొందాలంటే అన్ని అవయవాలు సరిగా పని చెయ్యాలి. ఏ ఒక్క అవయవం మొరాయించినా మనం మంచాన పడవలసిందే . ఇక మన శరీరంలో అన్ని అవయవాలు ఎంత ముఖ్యమో తెలిసి, అందుకు తగినట్టు అన్ని అవయవాలపైన శ్రద్ధ పెట్టాలి. ఇక మన శరీరంలో లివర్ అత్యంత ముఖ్యమైన అవయవం.

లివర్ ఆరోగ్యం కోసం మంచి ఆహార అలవాట్లు
శరీరంలో లివర్ చేసే పనులు అన్నీ ఇన్నీ కావు. కాబట్టి లివర్ ఆరోగ్యం పైన ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ శ్రద్ధ పెట్టాలి. లివర్ ఆరోగ్యంగా ఉంటేనే మన శరీరంలో అన్ని వ్యవస్థలు సక్రమంగా పని చేసేది. కనుక లివర్ ఆరోగ్యం కోసం మంచి ఆహారపు అలవాట్లను చేసుకోవాలి. లివర్ ఆరోగ్యంగా ఉంచుకోవాలి అనుకునేవారు ఎలాంటి ఆహారం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.

These are the super foods that protect liver health

లివర్ ఆరోగ్యం కోసం ఇవి తినండి
ముఖ్యంగా లివర్ ఆరోగ్యం కోసం సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. లివర్ ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ఇక లివర్ ఆరోగ్యం కోసం ప్రతీరోజూ యాపిల్ తినాలి. యాపిల్ తో లివర్ డిటాక్సిఫై అవుతుంది. ఇక లివర్ ఆరోగ్యం కోసం బ్లూ బెర్రీలు తినటం మంచిది.

లివర్ ఆరోగ్యానికి మేలు చేసేవి ఇవే
బ్లూ బెర్రీలు, బ్లాక్ బెర్రీలు ఏం తిన్నా లివర్ కు ఆరోగ్యం చేకూరుతుంది. వీటిలో బాగా యాంటీ ఆక్సిడెంట్ లు ఉంటాయి. బ్లాక్ టీ, గ్రీన్ టీ వంటి వాటిని తీసుకుంటే కూడా లివర్ కు మంచిది. ముఖ్యంగా గ్రీన్ టీని తాగడం వల్ల లివర్ ఆరోగ్యం బాగుపడుతుంది. లివర్ ఆరోగ్యంగా ఉండాలి అనుకునేవారు అవకాడోని తీసుకోవడం మంచిది. అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.

బొప్పాయితో పాటు ఈ పండ్లతో లివర్ ఆరోగ్యం
ఇవి మన లివర్ ను కాపాడతాయి. లివర్ లో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను ఇది బయటకు పంపుతుంది. లివర్ ని ఆరోగ్యంగా ఉంచటంలో సిట్రస్ పండ్లను, కివి పండ్లను, ద్రాక్ష పండ్లను తింటే మంచిది. బొప్పాయి కూడా లివర్ ఆరోగ్యం కోసం కీలకంగా పనిచేస్తుంది. బొప్పాయి లో ఉండే విటమిన్లు, ఎంజైమ్ లు లివర్ పైన పనిభారాన్ని బాగా తగ్గిస్తాయి. లివర్ ఫ్యాట్ ను దూరం చేస్తాయి.

లివర్ ఆరోగ్యం కోసం మీ డైట్ లో ఈ ఆహారాలు
లివర్ ఆరోగ్యం కోసం ఫ్యాటీ ఫిష్ తింటే మంచిది. అలాగే లివర్ ఆరోగ్యం కోసం డ్రై ఫ్రూట్స్ తింటే మంచిది. ఆలివ్ ఆయిల్ వినియోగం కూడా లివర్ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. కనుక ఎవరైనా లివర్ ఆరోగ్యం కోసం ఈ ఆహారాలను మీ డైట్ లో చేర్చుకోండి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+