హైబీపీ నియంత్రించేందుకు ఇలా చేస్తే మీరు మెడిసిన్స్ విసిరిపారేయొచ్చు
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య రక్తపోటు. అధిక రక్తపోటు సమస్య ఇప్పుడు సైలెంట్ కిల్లర్ లా మారి ప్రజల ప్రాణాలు తీస్తోంది. ధమనులలో రక్త పోటు పెరిగినప్పుడు హై బీపీ వస్తుంది. ప్రస్తుతం ఎటువంటి లక్షణాలు లేకుండానే, తాము హైబీపీతో బాధపడుతున్నామని తెలియకుండానే, హైబీపీతో బాధపడుతున్న వారు చాలామంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఇది అన్నిటికంటే ఆందోళనకరమైన అంశం.
హైబీపీ డేంజర్.. కంట్రోల్ అవ్వాలంటే ఇలా చెయ్యండి
హై బీపీ సైలెంట్ కిల్లర్ లాంటిది. ఇది ఎప్పుడు ఎటువంటి తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందో అర్థం కాదు. హై బీపీ కారణంగా గుండెపోటు బ్రెయిన్ స్ట్రోక్ వంటి తీవ్రమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఒకవేళ మీరు అధిక రక్తపోటును కలిగి ఉంటే మందులు లేకుండా రక్తపోటును నియంత్రించాలి అనుకుంటే ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి.

రక్తపోటును నియంత్రించే మార్గాలు
ఇక రక్త పోటును ఆరోగ్యకరంగా నియంత్రించడానికి ఐదు మార్గాలు ఉన్నాయి. అవేంటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
రక్తపోటును నియంత్రించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరం. అందులో ముఖ్యమైనది ఆహారం. ఆహారంలో మనం ఉప్పు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల రక్తపోటు సమస్య వస్తుంది. కాబట్టి ఉప్పు తక్కువ తినడం పైన దృష్టి పెట్టాలి.
హైబీపీ పేషెంట్స్ వీటిపై శ్రద్ధ పెట్టాలి
హైబీపీతో బాధపడేవారు వీలైనంతవరకు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు మరియు పప్పులు తినాలి. పొటాషియం అధికంగా ఉండే పండ్లను తినడం రక్తపోటును నియంత్రిస్తుంది. అధిక బరువు రక్తపోటును పెంచుతుంది. కాబట్టి బరువును కూడా ఎప్పుడు కంట్రోల్ లో ఉంచుకోవాలి. అదనపు కొవ్వు పదార్థాలను తీసుకోవడం తగ్గించి ఆహార నియమాలు, వ్యాయామం వంటి వాటితో బరువు పైన నియంత్రణ ఉంచాలి.
రక్తపోటు అదుపులో ఉండాలంటే ఇలా చెయ్యాలి
ఇక క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగు పడుతుంది. దీంతో మనం రక్తపోటును అదుపులో పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక చాలామందికి ధూమపానం అలవాటు ఉంటుంది. ఈ ధూమపానం రక్తపోటును పెంచుతుంది. ధూమపానంలో ఉండే నికోటిన్ రక్తపోటును పెంచుతుంది. కాబట్టి ఇది ఇతర తీవ్రమైన వ్యాధులకు కూడా కారణమవుతుంది.
ఇవి కూడా రక్తపోటుకు కారణాలే... జాగ్రత్త
ధూమపానం కారణంగా గుండె జబ్బులు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ధూమపానాన్ని వదిలివేయడం బిపిని కంట్రోల్ చేస్తుంది. అధిక రక్తపోటుకు అధిక ఒత్తిడి కూడా ప్రధాన కారణం కావచ్చు. దీనివల్ల కూడా శరీరంలో అనేక సమస్యలు వస్తాయి. గుండె పని చేసే సామర్థ్యం దెబ్బతింటుంది. కాబట్టి ఒత్తిడిని నివారించడానికి యోగా మరియు ధ్యానం చేయడం మంచిది. అలాగే రాత్రిపూట మంచి నిద్రపోవడం కూడా బీపీని అదుపులో ఉంచుతుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications