hairfall with foods: ఈ ఆహారాలతో మీ జుట్టు ఊడిపోతుంది.. జాగ్రత్త!

మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి పౌష్టికాహారాన్ని తినాలి. మనమే కాదు మన జుట్టు ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా మనం తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విపరీతంగా ఒత్తిడితో ఉన్నవారు, సరైన పోషకాహారం తీసుకొని వారు జుట్టు రాలిపోయే సమస్యను సహజంగా ఎదుర్కొంటూ ఉంటారు.

ఈ ఆహారాలతో జుట్టు రాలిపోతుంది
ఎక్కువగా జుట్టు రాలిపోతుందని రకరకాల నూనెలు తెచ్చి జుట్టు ఊడకుండా ఉండేందుకు నానా పాట్లు పడతారు. అయితే కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే జుట్టు ఊడిపోతుందని వైద్యులు చెబుతున్నారు. జుట్టు ఊడకుండా ఉండాలంటే పౌష్టిక ఆహారం తీసుకోవడం ఎంత అవసరమో, అదే విధంగా కొన్ని రకాల ఆహారాలు తీసుకోకుండా ఉండడం అంతే అవసరమని చెబుతున్నారు వైద్యులు.

These foods and drinks are the reason for your hairfall beware

ఇవి తింటే జుట్టు ఊడటం ఖాయం
చాలామంది తెలియక తినే ఈ ఆహారాలు మీ జుట్టును ఊడిపోయేలా చేస్తున్నాయని చెబుతున్నారు. ఏది పడితే అది తింటే జుట్టు ఊదిపోతుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కేకులు, పాస్తా, పిజ్జాలలో ఉండే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తో జుట్టు వేగంగా రాలిపోతుందని చెబుతున్నారు. అంతేకాదు బాదంపప్పు వంటి డ్రై ఫ్రూట్స్ ని ఎక్కువగా తింటే కూడా వాటిలో ఉండే సెలీనియం కారణంగా కూడా జుట్టు ఎక్కువగా రాలిపోతుందని అంటున్నారు.

ఇవి తాగితే జుట్టు రాలిపోతుంది
కాబట్టి డ్రై ఫ్రూట్స్ ను కూడా తగిన మోతాదులోనే తీసుకోవాలని సూచిస్తున్నారు. చాలామంది లిక్కర్ తాగుతూ ఉంటారు లిక్కర్ సేవించడం కూడా జుట్టు రాలిపోవడానికి జుట్టు సమస్యలకు కారణం అవుతుందని వారికి తెలియదు మద్యపానం చేసేవారిలో జుట్టు డిహైడ్రేట్ అవుతుంది. జుట్టు డిహైడ్రేట్ అయిపోతే అది వేగంగా రాలిపోతుంది. అంతేకాదు షుగర్ ఎక్కువగా ఆహారంలో భాగంగా చేసుకునే వారిలోనూ జుట్టు రాలిపోయే సమస్య ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

ఇవి షుగర్ ఎక్కువగా ఉన్న ఆహారాలు, లో ప్రోటీన్ డైట్ తీసుకుంటే కష్టం
చాలామంది డోనట్స్, కెచప్ వంటి వాటిని విపరీతంగా తీసుకుంటూ ఉంటారు. వీటిల్లో ఉండే షుగర్ కారణంగా బ్లడ్ సర్కులేషన్ తగ్గిపోతుంది. న్యూట్రియంట్స్ జుట్టు వరకు వెళ్ళవు. ఫలితంగా జుట్టు రాలిపోతుంది. ఇక శరీరానికి ప్రోటీన్ చాలా అవసరం. కొంతమంది లో ప్రోటీన్ డైట్ ను తీసుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో కూడా జుట్టు రాలిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

కూల్ డ్రింక్స్ తోనూ జుట్టుకు సమస్యలు
ఇక చాలామంది కూల్ డ్రింక్స్ ను తరచూ తాగుతూ ఉంటారు .కూల్ డ్రింక్స్ మాత్రమే కాదు ఇతర కార్బోనేటెడ్ డ్రింక్స్ ను కూడా తాగుతూ ఉంటారు. ఇలా తాగటం కూడా జుట్టు ఊడిపోవడానికి ఒక కారణంగా చెబుతున్నారు. అందుకే మనం తీసుకునే ఆహారంలో వీటిని తీసుకోకుండా ఉండేలా చూసుకోవాలని, అప్పుడే మనకు జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+