hairfall control with foods: ఈ ఆహారాలతో మీ జుట్టు రాలే సమస్యకు స్వస్తి!
మనం ఎంత అందంగా ఉన్నా జుట్టు లేకపోతే అంద విహీనంగా కనిపిస్తాము. జుట్టు ఆరోగ్యంగా అందంగా ఉంటే మనిషి యొక్క అందం మరింత ఇనుమడించబడుతుంది. అయితే ప్రస్తుతం వాతావరణ కాలుష్యం, సరైన పోషకాహారం తీసుకోకపోవడం, విపరీతమైన ఒత్తిడి కారణంగా జుట్టు తెగ రాలిపోతుంది. బలహీనంగా తయారవుతుంది. బలంగా ఉండాలంటే మనం ఏ ఆహారాలు తీసుకోవాలి? జుట్టు రాలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టు బలంగా ఉండాలంటే ఇవి తినండి
జుట్టు బలంగా ఉండాలంటే శరీరానికి కెరోటిన్ అందటం చాలా ముఖ్యం. కెరోటిన్ అధికంగా లభించే ఆహారాలు మన డైట్ లో ఉండడం జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కోడి గుడ్లలో కెరోటిన్ ఎక్కువగా ఉంటాయి. కెరోటిన్ ఎక్కువగా ఉండే కోడిగుడ్లు తినడం జుట్టును దృఢంగా చేస్తుంది. గుడ్డులోని బయోటిన్ సైతం జుట్టు రాలడాన్ని తగ్గించి బలంగా ఉండేలా చేస్తుంది.

ఇవి తింటే జుట్టు బలంగా ఉంటుంది
ఇక డ్రై ఫ్రూట్స్, నట్స్, మన జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, దీంతో జుట్టు రాలకుండా ఉంటుంది, బాదంపప్పు, వాల్నట్స్, గుమ్మడి గింజలు, పొద్దు తిరుగుడు గింజలు మీ డైట్ లో చేర్చుకుంటే వీటితో శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. ఫలితంగా జుట్టుకు కావలసిన పోషకాలు కూడా అంది జుట్టు ఆరోగ్యంగా తయారవుతుంది.
చిలగడదుంపలు, ఆకు కూరలతో జుట్టు ధృడం
జుట్టు బలంగా దృఢంగా ఉండాలంటే చిలకడ దుంపలు తినాలి. చిలకడదుంపల్లో ఉండే బీటా కెరటిన్ జుట్టును పెరిగేలా చేస్తుంది. పాలకూర, బ్రోకలీ వంటి ఆకుకూరల్లో కూడా జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గుణాలు ఉన్నాయి . ఇవి కూడా కెరోటిన్ ఉత్పత్తిని పెంచుతాయి.
ఆహారంలో ఈ పండ్లు తింటే జుట్టు రాలదు
మనం తినే ఆహారంలో పండ్లకు కూడా స్థానం ఇవ్వాలి. బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు తింటే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. క్యారెట్ లో బీటా కెరోటిన్ ఉంటుంది. క్యారెట్ ని కూడా మన ఆహారంలో భాగంగా చేసుకుంటే ఇది జుట్టు సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫలితంగా జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఆరోగ్యంగా ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాదు మన ఆహారంలో అరటి పండ్లను భాగంగా చేసుకుంటే జుట్టు రాలకుండా ఉంటుంది. అరటిపండులో ఉండే పోషకాలు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications