పురుషుల్లో సామర్థ్యాన్ని పెంచే కాయగూరలు
లైంగిక ఆనందం అనేది జీవితంలో ఒక భాగం. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. దీనివల్ల ఎక్కువమంది లైంగిక ఆనందాన్ని పొందలేకపోతున్నారు. పురుషుల్లో అంగస్తంభన, వేగవంతమైన స్కలనం వంటి లైంగిక సమస్యలు తరుచుగా ఎదురువుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యల నుంచి బయటపడటానికి, శక్తిని పెంచుకునేందుకు కొన్ని ఆహార చిట్కాలున్నాయి.. వాటిగురించి తెలుసుకుందాం.
శృంగార హార్మోన్లు పెరగడానికి ప్రాచీన కాలం నుంచే పాలు, తేనె ఉపయోగిస్తున్నారు. ఖర్జూర పండ్లు, గుడ్లు, తాజా ఆకు కూరలు, మొలకెత్తిన విత్తనాలు, కీరదోస, బీట్ రూట్, క్యారెట్ లాంటివాటిని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల శృంగార సామర్థ్యం పెరుగుతుంది. ఆపిల్, దానిమ్మ, నేరేడు పండ్లు, నిమ్మ పండ్లను కూడా ఆహారంలో చేర్చుకోవాలి. వీటిని వాడటం వల్ల శృంగార సామర్థ్యం పెరుగుతుంది. వీటితో పాటు కొన్ని ఆహారాలు తీసుకుంటే లైంగిక శక్తి పెరుగుతుంది.

అరటి పండు:అరటిపండులో కాల్షియం, పొటాషియం, విటమిన్ B6 ఉంటాయి. ఇవి లైంగిక శక్తికి గొప్ప మూలం. కాబట్టి అరటిని ఎక్కువగా తీసుకుంటుండాలి.
మునగాకు:మునగాకు తీసుకొని అందులో ఉప్పు, పసుపు వేసి బాగా ఉడకనివ్వాలి. మెత్తగా పేస్టులా చేసుకొని దీన్ని ప్రతిరోజు బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత రెండు స్పూన్లు తినాలి. దీనివల్ల పురుషుల్లో వీర్యం వృద్ధి చెందుతుంది. శీఘ్ర స్కలనం సమస్య తగ్గడమే కాకుండా లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.
ఖర్జూరం:
శరీరంలో ఐరన్ కంటెంట్‌ను పెంచుతుంది. పోషకాలు ఎక్కువగా ఉంటాయి. శృంగారాన్ని ప్రోత్సహించే శక్తిని ఇస్తుంది. లైంగిక సంబంధిత సమస్యలతో బాధపడే వారు ఖర్జూరాను అధికంగా తీసుకుంటుండాలి.
బెండకాయ :బెండకాయ లైంగిక సమస్యలను తగ్గించడమే కాకుండా శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది.
కోడిగుడ్డు:కోడిగుడ్డు లో విటమిన్ b5, విటమిన్ బి 6 పుష్కలంగా ఉన్నాయి. ఇవి హార్మోన్లను సమతూకం చేస్తాయి. లైంగిక వాంఛను కూడా కలిగిస్తాయి.
క్యారెట్:అలసట, వేగవంతమైన స్కలనం వంటి సమస్యలతో బాధపడేవారికి క్యారెట్ ఉత్తమ ఔషధం. దీన్ని ప్రతిరోజు తీసుకోవడంవల్ల లైంగిక సమస్యలే రావని నిపుణులు తెలియజేస్తున్నారు.
ఎండు ద్రాక్ష:శృంగార సామర్థ్యాన్ని పెంచడంలో ఎండుద్రాక్ష ఎంతో ప్రభావం చూపుతుంది. పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. ఒంట్లో నీరసం తగ్గుతుంది. కిస్ మిస్ ను తినడం వల్ల లైంగిక జీవితం మెరుగుపడుతుంది. సంతాన సాఫల్యత మెరుగుపడుతుందని ఆయుర్వేదం చెబుతోంది.
వెల్లుల్లి:ఇందులో యాంటీ-అఫ్రోడిసియాక్ లక్షణాలున్నాయి. తక్కువ లిబిడో వంటి లైంగిక సమస్యలకు ఇది నివారణ.












Click it and Unblock the Notifications