నమ్మండి ... ఈ అలవాట్లతో మీరు యవ్వనంగా ఉంటారు!

ఆరోగ్యంగాను, యవ్వనంగానూ ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా, యవ్వనంగా ఉండాలనుకుంటారు. అటువంటివారు ఒక ఎనిమిది అలవాట్లను చేసుకుంటే యవ్వనంగా ఉంటారు. వృద్ధాప్యం రాకుండా ఎక్కువ కాలం జీవిస్తారు. మరి ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుందాం. మన హృదయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వల్ల మన వయసు కూడా కాస్త తగ్గినట్టుగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఆహారం విషయంలో జాగ్రత్త
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఈ నేపథ్యంలోనే ఎక్కువ కాలం యవ్వనంగా ఉండడం కోసం అవసరమైన అలవాట్లను వెల్లడించింది. వృద్ధాప్యాన్ని తగ్గించే రోజువారి అలవాట్లలో ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. పండ్లు, కూరగాయలు, మాంసకృత్తులు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ట్రాన్స్ ఫ్యాట్స్, వేయించిన ఆహారాలు, చక్కెర ఆహారాలను తగ్గించాలి.

these habits will keep you young

యవ్వనంగా ఉండాలంటే వీటికి దూరంగా ఉండండి
యవ్వనంగా ఉండాలనుకునే వారు వ్యాయామం రెగ్యులర్ గా చేయాలి. డయాబెటిస్, రక్తపోటు, కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ప్రతిరోజు వ్యాయామం చేయడం సూచించబడింది. ఇక యవ్వనంగా ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు ధూమపానాన్ని మానుకోవాలి. ధూమపానం మద్యపానం ఆరోగ్యం పైన ప్రభావం చూపి త్వరగా వృద్ధాప్యం వచ్చేలా చేస్తాయి. కనుక వీటికి దూరంగా ఉండాలి.

నిద్ర, బరువు, కొలెస్ట్రాల్ కంట్రోల్ తో యవ్వనం
యవ్వనంగా ఉండాలని భావించేవారు ప్రతిరోజు ఏడు నుంచి ఎనిమిది గంటల నాణ్యమైన నిద్ర పోవాలి. ఒకవేళ సరైన నిద్రపోకుంటే అది ఊబకాయానికి దారి తీస్తుంది. కనుక జాగ్రత్త వహించాలి. ఇక యవ్వనంగా కనిపించాలి అనుకునేవారు బరువును నియంత్రించాలి. ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేస్తే వయసు తగ్గినట్టు కనిపిస్తుంది. యవ్వనంగా కనిపించాలని భావించేవారు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలి.

గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా చూసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే గుండెపోటు స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. బ్లడ్ షుగర్ ని ఎప్పటికప్పుడు నియంత్రణలో ఉంచుకోవాలి. డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటే ఆరోగ్యంతో పాటు యవ్వనంగా కూడా ఉంటారు. ఇక రక్తపోటును అదుపులో ఉంచుకుంటే వృద్ధాప్య ప్రక్రియను స్లో చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యవ్వనంగా ఉండాలని భావించేవారు పైన సూచించిన అలవాట్లను తప్పనిసరిగా చేసుకోండి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+