ఇవన్నీ సూపర్ ఫుడ్స్.. తినిచూడండి..!

కోడి గుడ్డు ఒక సూపర్ ఫుడ్‌. చాలామంది ప్రొటీన్ల కోసం గుడ్డుని తింటారు. అంతేకాదు.. దీనివల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వాస్తవానికి మానసిక ఆరోగ్యం బాగుండాలంటే సెరోటోనిన్‌ను పెంచే ఆహారాలను తీసుకోవాలి. దీనినే హ్యాపీ హార్మోన్ అంటారు. మానసిక స్థితి, నిద్ర, ఆకలి, జ్ఞాపకశక్తి సంబంధిత విధులను నియంత్రించడానికి పనిచేస్తుంది. ఇది గుడ్డులో పుష్కలంగా లభిస్తుండటంతోపాటు ఇంకా శరీరానికి ఎన్ని లాభాలున్నాయో తెలుసుకుందాం.

వాల్‌నట్ ఒక అద్భుతమైన డ్రై ఫ్రూట్. ఇందులో పోషకాల కొరత ఉండదు. డైటీషియన్లు మంచి ఆరోగ్యం కోసం దీనిని తీసుకోవాలని సూచిస్తుంటారు. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడుకు చాలా అవసరం. శరీరంలో ఉత్పత్తి అవదు. అందువల్ల ప్రతిరోజు ఆహారం ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ప్రతిరోజు పరిమిత పరిమాణంలో తింటే డిప్రెషన్‌ను నివారించవచ్చు.

super foods

వాల్‌నట్‌ల మాదిరిగానే బాదంపప్పు కూడా ఒక మంచి డ్రై ఫ్రూట్. దీనిని ఎండబెట్టి, నానబెట్టి తినాలి. మెగ్నీషియం పుష్కలంగా లభించడమే కాకుండా శక్తిని ఇస్తుంది. మనిషి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

నాన్ వెజ్ ఫుడ్‌ను ఇష్టపడేవారు సాల్మన్, ట్యూనా వంటి కొవ్వు చేపలను తినాలి. వీటిలో విటమిన్ డి ఉంటుంది. డిప్రెషన్ వంటి సమస్యలను దూరం చేయడంలో తోడ్పడటమే కాకుండా శరీరానికి ఒమేగాను అందిస్తుంది

బాదం పప్పు వల్ల శరీరానికి కాల్షియం లభిస్తుంది. బాదంలో నాలుగో వంతు కాల్షియం ఉండటంతో ఎముకలు బలోపేతమవుతాయి. విరిగిపోకుండా ధృఢంగా ఉంటాయి. ఫాస్పరస్ శాతం ఎక్కువగా ఉండి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను సైతం బాదం నియంత్రిస్తుంది. డయాబెటీస్ రోగుల్లో మెగ్నీషియం లోపాన్ని బాదంతో భర్తీ చేయొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+