చలికాలంలో తినాల్సిన సూపర్ పండు ఇదే.. అస్సలు మర్చిపోకండి!

జామ పండు చలికాలంలో వచ్చే సీజనల్ ఫ్రూట్. ఈ సీజన్లో జామ పండ్లను తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. జామ పండులో బోలెడు పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా జామ పంటలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది చలికాలంలో మన శరీరాన్ని ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడుతుంది. మన రోగనిరోధక శక్తిని పెంచి మనం ఆరోగ్యంగా ఉండడానికి జామపండు ఎంతగానో దోహదం చేస్తుంది.

జామపండుతో ఆరోగ్య ప్రయోజనాలు
జామపండును తినడం వల్ల మన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ మన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి ఎంతగానో సహకరిస్తుంది. జామ పండులో విటమిన్ సి మన శరీరంలో కొలాజిన్ ఉత్పత్తిని పెంచుతుంది. జామపండును ప్రతిరోజు తినడం వల్ల చర్మం యవ్వనంగా మారుతుంది. ఇది చర్మ సౌందర్యాన్ని పెంచేలా చేస్తుంది. జామ పండులో మెగ్నీషియం ఉంటుంది. ఇది మన మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ఎంతగానో దోహదం చేస్తుంది.

This is the super fruit to eat in winter don t forget to eat guava

బరువుకు, మధుమేహానికి జామపండుతో చెక్
జామ పండులో ఉండే ఫైబర్ మనం తినడం వల్ల మన కడుపు నిండుగా ఉన్నట్టుగా చేస్తుంది. దీనివల్ల మనం అదనంగా ఎక్కువగా తినకుండా ఉంటాము. ఫలితంగా బరువు తగ్గడానికి జామపండు ఎంతో బాగా దోహదం చేస్తుంది. జామ పండ్లలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది మధుమేహం బారినపడి బాధపడుతున్న వారికి అద్భుతమైన సేఫెస్ట్ పండుగా చెప్పవచ్చు.
మధుమేహ బాధితులు ఎలాంటి అనుమానాలు లేకుండా జామపండును తినవచ్చు.

జామపండుతో ఈ లాభాలు కూడా
ఇక జామపండును తినడం వల్ల మన ఎముకల పుష్టి పెరుగుతుంది. మన మెదడు ఆరోగ్యాన్ని జామ పండు మెరుగుపరుస్తుంది. జామ పండులో ఉండే పోషకాలు మన కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇందులో ఉండే ఫోలేట్ మన పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నరాల బలహీనతతో బాధపడేవారు జామ పండ్లు తినడం ఎంతో మంచిది. జామ పండ్లు మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి.

హైబీపీతో పాటు గుండె ఆరోగ్యానికి జామపండు
అధిక రక్తపోటుతో బాధపడే వారికి, హై బీపీని తగ్గించడానికి జామపండు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. జామపండు మన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన జామపండు శీతాకాలంలో మనకు వచ్చే అనేక అనారోగ్య సమస్యలను రాకుండా అడ్డుకుంటుంది. కనుక ఈ సీజన్ లో సూపర్ ఫ్రూట్ జామపండును ప్రతి ఒక్కరు ఎంచక్కా తినేయొచ్చు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+