ఈ ఒక్క పండు చాలు... బీపీ, డయాబెటిస్ కంట్రోల్!
మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే వాటిలో పండ్లు ఒకటి. అయితే కొన్ని పండ్లు ప్రత్యేకమైన పోషకాలతో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. అటువంటి పండ్లలో కివి పండు ఒకటి. ఇది చాలా ప్రత్యేకమైన రుచిని, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిఉన్న పోషకాలతో కూడుకున్న పండు. కొద్దిగా తీయగా, కొద్దిగా పుల్లగా ఉండే ఈ పండులో విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ కె, ఫైబర్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
కివీ పండులో ఫుల్ పోషకాలు
కివీ పండులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి.కివి పండు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్ సి మన ఇమ్యూనిటీని పెంచడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. కివీ పండులో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల ఇది మన జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. కివి పండులో మన గుండె ఆరోగ్యాన్ని కాపాడే పోషకాలు ఉన్నాయి.

కివీ పండ్లతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు
కివీ పండ్లలో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల ఇది మన హైబీపీని నియంత్రించడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కివి పండును విటమిన్ ఏ, లుటీన్ వంటివి ఉండడంవల్ల ఇవి కంటి ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చర్మ సౌందర్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. కివి పండులో సెరటోనిన్ ఉంటుంది. ఇది మన నిద్రను మెరుగుపరుస్తుంది.
కివీతో బరువుకు చెక్, డయాబెటిస్ కంట్రోల్
కివి పండు ఆస్తమా లక్షణాలను తగ్గిస్తుంది. క్యాన్సర్ నివారణకు కివి పండు ఎంతగానో సహాయపడుతుంది. కివి పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మనకు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. తద్వారా ఇది మన బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది. కివి పండు మన డయాబెటిస్ ను కంట్రోల్ చేయడానికి డయాబెటిస్ పేషెంట్స్ కు కూడా మంచిది.
ప్రతీరోజూ ఒక కివీ పండు ... ఇక ఆరోగ్యంగా ఉండు
చైనాకు చెందిన ఈ పండు మనదేశంలో కంటే న్యూజిలాండ్ లో బాగా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు మనదేశంలో కూడా అందుబాటులో ఉన్న ఈ పండు ఇచ్చే ఆరోగ్య వరాలు అన్ని ఇన్ని కాదు. కనుక ప్రతిరోజు ఒక కివి పండును ఆహారంలో భాగంగా చేసుకుంటే ఇక తిరుగే ఉండదు.












Click it and Unblock the Notifications