థైరాయిడ్ ఉన్న‌వారు వీటిని అసలు తినొద్దట..!

ప్రస్తుతం థైరాయిడ్ సమస్య ప్రపంచవ్యాప్తంగా అధికమవుతుంది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, బిజీ లైఫ్, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి, పని భారం.. తదితర కారణాల వల్ల థైరాయిడ్ సమస్య వస్తుంటుంది. మగవారితో పోల్చితే మహిళల్లో ఈ సమస్య అధికంగా ఉంటుంది. థైరాయిడ్ కారణంగా మహిళలు అనేక ఇబ్బందులు పడుతుంటారు. పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం.. అలాగే బరువు పెరగడం లాంటి ఆరోగ్య సమస్యలు వారిని నిత్యం వెంటాడుతుంటాయి.

అయితే థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్లు బ్రోకలి, క్యాబేజీ, కాలీఫ్లవర్.. తదితర ఆహారాలు హార్మోన్ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తాయని వైద్యులు చెబుతున్నారు. అలాగే థైరాయిడ్ సమస్యతో బాధపడేవాళ్లు సోయా తినకూడదట. సోయాలోని ఐసోఫ్లేవన్స్ థైరాయిడ్ గ్రంథి పనితీరుకు ఆటంకం కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. బాగా ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెర మోతాదు అధికంగా ఉన్న ఆహారం తింటే థెరాయిడ్ పనితీరులో హెచ్చుతగ్గులు జరిగి ఈ సమస్య అధికం అవుతుందని వైద్యులు వివరిస్తున్నారు.

అలాగే థైరాయిడ్ తో బాధపడేవాళ్లు మద్యం సేవించడం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఆల్కహాల్.. థైరాయిడ్ గ్రంథిపై తీవ్ర ప్రభావం చూపుతుందని సమస్య మరింత తీవ్రతరం అవుతుందని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. అంతేకాక థైరాయిడ్ గ్రంథి ఉన్నవాళ్లు టీ, కాఫీలు అధికంగా తీసుకోవడం మంచిది కాదు. ఫ్యాట్ అధికంగా ఉన్న ఆహారం కారణంగా థైరాయిడ్ ట్యాబ్లెట్స్ వాడుతున్నవారిపై ప్రభావం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

Thyroid Diet Guide Doctors Reveal Best Foods to Eat and Avoid for Optimal Health

థైరాయిడ్ తో బాధపడేవాళ్లు.. గుడ్లు, బాదం, సన్‌ ఫ్లవర్ గింజలు, వేరుసెనగలు, పండ్లు, తాజా కూరగాయలు, మిల్లెట్స్ (జొన్న, రాగి, సజ్జ), గోధుమ రొట్టెలు తినొచ్చని వైద్యులు చెబుతున్నారు. అలాగే ప్రతిరోజూ సరిపడా నీరు తాగడం, వ్యాయామం చేయడం ద్వారా థైరాయిడ్ సమస్య నియంత్రణలోకి వస్తుందని వైద్యులు వివరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+