ఆరోగ్యంతో పాటు ఫిట్ గా ఉండాలంటే ఇవి తప్ప ఇంకేం చెయ్యకండి!

ఆరోగ్యమే మహా భాగ్యం అని పెద్దలు చెప్తారు. ఆరోగ్యంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. ఆరోగ్యంగా ఉండడం కోసం కేవలం కోరిక ఉంటే సరిపోదు. క్రమబద్ధమైన జీవనశైలిని అలవర్చుకోవాలి. మంచి ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలి. సహజంగా మన ఆరోగ్యం మన అలవాట్ల పైన ఆధారపడి ఉంటుంది.

ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చెయ్యండి
ఆరోగ్యంగా ఉండాలని భావించేవారు ప్రతిరోజు కొన్ని నియమాలను పాటిస్తే నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించవచ్చు. ఇక ఆరోగ్యంగా ఉండాలి అనుకునేవారు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ప్రస్తుతం తెలుసుకుందాం. ఆరోగ్యంగా ఉండాలి అనుకునేవారు ముందు బద్దకాన్ని వదిలిపెట్టాలి. ప్రతిరోజు వర్కౌట్స్ తో రోజున ప్రారంభించాలి. వీలైతే కాసేపు మెడిటేషన్ చేయాలి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వ్యాయామం, మెడిటేషన్ ఎంత ఉపయోగపడతాయి.

To stay healthy and fit you must follow these super tips

ఆరోగ్యం కోసం డైట్ ఇలా చూసుకోండి
ఇక ఆరోగ్యం కోసం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ కూడా హెల్తీగా ఉండేలా చూసుకోవాలి. ప్రతిరోజు ఓట్స్, నట్స్, ఫ్రూట్స్ వంటివి తింటే ఆరోగ్యంగా ఉంటాం. ఇక ఇదే సమయంలో భోజనంలో కూడా సరైన డైట్ ను పాటించాలి. ఆరోగ్యం కోసం భోజనంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించుకోవాలి. రోజంతా ఉండే పని ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తూనే మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.

నిద్రకూ సముచిత స్థానం
ఎవరైతే ఆరోగ్యంగా ఉండాలని భావిస్తారో వారు తప్పనిసరిగా ప్రతిరోజు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోవాలి. సరైన నిద్ర అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసి మన శరీరాన్ని రిపేర్ చేస్తుంది. కనుక ఆరోగ్యం కావాలంటే నిద్రకూ సరైన ప్రాధాన్యత నివ్వాలి. ఇక రోజంతా శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి ప్రయత్నించాలి.

ఈ నియమాలు పాటించండి
తగినంత మంచినీటిని తాగాలి. షుగర్ కంటెంట్ అధికంగా ఉన్న వేటిని కూడా తినకుండా ఉంటేనే మంచిది. కూల్డ్రింక్స్ వంటి వాటికీ కూడా దూరంగా ఉండాలి. అర్దరాత్రి దాకా మెలకువతో ఉండటం. లేట్ నైట్స్ లో తినటం చెయ్యకూడదు. ఈ బేసిక్ నియమాలను పాటిస్తే ఖచ్చితంగా ఆరోగ్య వంతులుగా జీవించడానికి అవకాశం ఉంటుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+